1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (15:10 IST)

హనుమాన్ ప్రేక్షకుల కోసం వారంపాటు రేటు తగ్గించిన నిర్మాత నిరంజన్ రెడ్డి

Human ticket rates
Human ticket rates
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ్ సజ్జ నటించిన సినిమా హనుమాన్. సంక్రాంతికి విడుదలైన సినిమా జాతీయస్థాయిలో వసూళ్ళను రాబట్టుకుంది. అయోధ్య రామాలయం కోసం టిక్కెట్టలో కొంత భాాగాన్ని విరాళంగా ఇచ్చారు. అనుకున్నదానికంటే విజయం సాధిండంతో ఉత్సాహంతో సీక్వెల్ తీయడానికి దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా ఇంకా చూడాలనుకునేవారికి వారంరోజులపాటు టిక్కెట్లరేట్లను తగ్గించింది.
 
ఈరోజు టిక్కెట్ల రేట్ల గురించి ప్రకటచేస్తూ, హనుమాన్  సినీ ప్రేమికులకు అత్యంత చౌకగా మారింది.  సినిమా ప్రదర్శమయ్యే సింగిల్ స్క్రీన్‌లలో కేవలం ₹99 మరియు అన్ని నేషనల్ మల్టీప్లెక్స్ చైన్‌లలో ₹112తో వారం మొత్తం (FEB 24 - FEB 29) ఈ రేటులు వుంటాయని తెలియజేసింది. ఇక ఇదేరోజు హీరో నాని పుట్టినరోజు సందర్భంగా నన్ను దర్శకుడిగా అవకాశం ఇచ్చిన మొదటి నిర్మాత నానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు.