1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (09:47 IST)

హనుమాన్ సినిమా మరో రికార్డ్ పొందింది

gkrishnareddy - Tej sajja
gkrishnareddy - Tej sajja
దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిన హనుమాన్ సినిమా మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటికి మూడు సినిమాలకు పోటీ ఇచ్చి సక్సెస్ బాటలో నడుస్తోంది. బాలీవుడ్ లోనూ హవా కొనసాగుతుంది. అందుకే అందులో నటించిన తేజ్ సజ్జ ఇటీవలే సౌత్ పర్యటన, దక్షిణాది పర్యటన చేసి వచ్చారు. అందులో భాగంగా వెళ్ళి బిజెపి. నాయకుడు జి.క్రిష్ణారెడ్డిని కలిసి వచ్చారు. ఆయన్ను కలవడం చాలా ఆనందంగా వుందనితేజ్ ట్వీట్ చేశాడు.
 
ఈ చిత్రం సూపర్ హిట్ కావడమే కాకుండా, అయోధ్యలోని భవ్య రామ మందిరానికి ప్రతి టిక్కెట్టు నుండి రూ. 5 విరాళంగా ఇవ్వడం ద్వారా అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో కూడా చేరింది. ఈ సందర్బంగా తేజ్ ఆనందం వ్యక్త చేస్తూ ఇలాంటి అవకాశం తనకు చిన్న వయస్సులో రావడం అంతా హనుమాన్ దయ అంటూ పేర్కొన్నారు.