అచ్చం నేను అఘోరాలా వుంటేనా? టిక్కట్ల రేట్ల గురించి బాలకృష్ణ చెప్పిన కీలక సమాధానాలు
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అఖండమైన విజయాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ పలు ప్రశ్నలకు సానుకూలంగా సమాధానం చెప్పారు. ఆ వివరాలు.
అఖండలో ఒరిజినల్ అఘోరాలా కేశాలతో వుండలేదు?
ఈ ప్రశ్న నా ఫ్యాన్స్ కూడా నాకు చెప్పలేదు. అఘోరాల పాత్ర అనగానే శివునిలా జటాజూటాలుంటాయి. హిమాచలప్రదేశ్‌లో చాలామంది అఘోరాల గురించి ఫొటోలు వారి గురించి వివరాలు ఫ్యాన్స్ పంపారు కూడా. అందులో వారు జుట్టు కత్తిరించుకోరు. కేశాలు చాలా పొడుగుగా వుంటాయి. ఒక్కోసారి వారి తపస్సు చేస్తుంటే మంచులో వుండిపోతాయి.
వారు అవసరం అయినప్పుడు జుట్టతో కిందనుంచి నీళ్ళను రప్పించి మీద పోసుకునేవారు. ఇక సినిమా పరంగా చూస్తే, నన్ను అంత జట్టు వుంటే గుర్తుపట్టరు. కేవలం పాత్ర కనిపించాలి. హీరోలు ఎవరైనా సరే ఆ పాత్ర చేసినా ఇలానే చేస్తారు. అందుకే జుట్టు పెంచలేదు. పెంచితే అఘోరాల అయ్యప్ప శర్మలా అయిపోతాను. ఎవరూ గుర్తుపట్టేవారుకాదు అంటూ చలోక్తి విసిరారు.
ఎం.ఎల్.ఓ. హోదాతో ఎ.పి.లో టిక్కట్ల రేట్ల విషయమై జగన్‌తో మాట్టాడవచ్చుగదా?
మాట్లాడవచ్చు. నేను ప్రజాప్రతినిధిగా అక్కడ వుంటే ప్రశ్నిస్తాను. ఇప్పుడు ఎ.పి. ప్రభుత్వం దానిపై మాట్లాడింది.. అందరం కలిసి పోరాడాల్సిన అవసరం వుంది. అందుకే సీనీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఏది ఏమైనా కొంత సంయమనం పాటించాలి.
అఖండ సినిమా ఆంధ్రప్రదేశ్‌లోని సంఘటనలుగా తీశారని చాలా సన్నివేశాలు చెబుతున్నాయి?
అవును. మనది భారతదేశం. అందులో ఆంధ్ర ఓ ప్రాంతం. అక్కడి సమస్యలు మీకు సినిమాలో కనిపించవచ్చు. దేవాలయంలో విగ్రహాల సన్నివేశపరంగా ఇలా.. కొన్ని వున్నాయి. దానిని దర్శకుడు బోయపాటి శ్రీను యూనివర్సల్ చేశాడు.