సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (17:37 IST)

జూనియర్ ఎన్టీఆర్‌కు షాకిచ్చిన పోలీసులు.. బ్లాక్ ఫిల్మ్ తొలగింపు

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు హైదరాబాద్ నగర పోలీసులు తేరుకోలేని షాకిచ్చారు. ఆయన లగ్జరీ కారుకున్న బ్లాక్ ఫిల్మ్‌ను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. గత ఆదివారం నుంచి హైదరాబాద్ నగర ట్రాఫఇక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో అనధికారికంగా ప్రెస్, ఎమ్మెల్యే, పోలీస్ స్టిక్కర్లు అంటించిన వారిని గుర్తించి అపరాధం విధిస్తున్నారు. అలాగే, కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లను కూడా తొలగించారు. 
 
ఖైరతాబాద్‌ పరిధిలోని ఇందిరా గాంధీ చౌరస్తా, ఫిలిం నగర్ కూడలి, జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు‌తో సహా పలు ప్రాంతాల్లో ఈ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద జరిపిన తనిఖీల్లో బ్లాక్ ఫిల్మ్‌లు, స్టిక్కర్లు ఉన్న వాహనాలను గుర్తించి వాటిని తొలగించారు. 
 
ఇందులోభాగంగా, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చెందిన కారుకు బ్లాక్‌ఫిల్మ్‌ను గుర్తించి తొలగించారు. ఆ కారును ఆపి బ్లాక్‌ఫిల్మ్ తొలగించారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్ లేరు. డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. డ్రైవర్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు, మరో వ్యక్తి ఉన్నారు. 
 
సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల మేరకు కారులో ప్రయాణిస్తున్న వారు 70 శాతం మేరకు కనిపించాల్సివుంటుంది. బ్లాక్ ఫిల్మ్ కోటింగ్ ఉన్న అద్దాలు అమర్చడం నిబంధనలకు విరుద్ధం. అందుకే నల్లటి ఫిల్మ్‌ను తొలగిస్తారు.