అందుకే నా రొమ్ములు జారిపోయాయ్... ఎంజాయ్ చేసుకోండి... ఎవరు?
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటికి చేదు అనుభవం ఎదురైంది. ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేశారు. నీ రొమ్ములు అలా జారిపోయాయేమిటి అంటూ అసభ్యకర కామెంట్లు చేశారు. ఈ పోస్టులను చూసిన స్వస్తిక ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి కామెంట్లకు గట్టిగా బదులిచ్చింది.
తను పోస్ట్ చేసిన తన ఫోటోను చూసి చాలామంది నీ రొమ్ములు ఎందుకు అలా జారిపోయాయి అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు పెట్టారు. అసలు పురుషులు ఎందుకు మహిళల రొమ్ములపై కామెంట్లు చేస్తారు అంటూ నిలదీసింది. అంతేకాదు... ఏళ్ల తరబడి పిల్లలకు పురుషులు కూడా పాలిస్తే తెలుస్తుంది రొమ్ములు ఎందుకు అలా సాగిపోతాయో అంటూ పేర్కొంది.
నా రొమ్ములు ఇలా సాగిపోయి వున్నందుకు తనేమీ బాధపడటం లేదనీ, గర్విస్తున్నానని వెల్లడించింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను గౌరవించాల్సింది పోయి నా ఫోటోను చూసి వాటి చుట్టూ సర్కస్ చేస్తున్నారు. ఇంకే... వాటి గురించి మీకు ఇష్టం వచ్చినవి రాసుకుంటూ ఎంజాయ్ చేయండి అంటూ మండిపడింది.