మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 18 జనవరి 2019 (21:59 IST)

కారులో ఎవడితోనో... అని రాస్తే ఏం చేయాలి? ట్వీట్ బైట పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్

సామాజిక మాధ్యమాలు వున్నాయి కదా అని కొందరు మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నటి రకుల్ ప్రీత్ సింగ్ వేసుకున్న దుస్తులపై కామెంట్ చేసిన ఓ నెటిజన్ దారుణంగా రాశాడు. కారులో ఎవరితోనో.. అంటూ చెప్పలేని కామెంట్ పెట్టాడు. తొలుత దీనిని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించలేదు. ఐతే ఆ తర్వాత ఆమె అతడిపై చేసిన కామెంట్లకు కొందరు నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెట్టడంతో... అతడు పెట్టిన ట్వీట్ సారాంశాన్ని మొత్తం బయటపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. 
 
కాగా ఇటీవల ముంబైకు వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ కురచ దుస్తులు ధరించి, కారు దిగుతూ కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటలోలకు ఓ యువకుడు దారుణమైన కామెంట్ పెట్టాడు. వీటిపై రకుల్ ప్రీత్ స్పందించింది. ఆ యువకుడిని చీవాట్లు పెడుతూనే అతని తల్లిని కూడా ఈ వివాదంలోకి లాగింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
'నీపై వచ్చిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానిస్తావా' అంటూ ఓ నెటిజన్ ప్రశ్నిస్తే.. 'అసలు నువ్వు ఎలాంటి దుస్తులు ధరించావో తెలుసా' అని మరొకరు, 'నీ వాలకం చూస్తుంటే ఎలాగైనా అనుకోవచ్చు' అంటూ ఇంకో నెటిజన్ ప్రశ్నించాడు. ఇలా సాగింది రకుల్ ప్రీత్‌పై నెటిజన్ల ట్రోలింగ్. 
 
రకుల్ కామెంట్‌ను అతికొద్దిమంది మాత్రమే సమర్ధించగా, పలువురు విమర్శించారు. ఇక తనపై వస్తున్న ట్రోలింగ్‌ను చూస్తున్న రకుల్, తన ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించింది. 'నా నీతి, నిజాయితీలను ప్రశ్నిస్తున్నవారు మహిళలను లక్ష్యం చేసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇటువంటి సంకుంచిత మనస్కులకు బుద్ధి చెప్పేందుకు నాకు వచ్చిన పదాలను నేను వాడాను. వారికి కూడా ఓ కుటుంబం ఉందని గుర్తు చేయాలన్నదే నా అభిప్రాయం. నాపై వచ్చిన కామెంట్లే వారిపైనా వస్తే..? అతని తల్లి లాగి ఒకటిస్తుందనే అనుకుంటున్నా' అంటూ కౌంటరిచ్చింది. 
 
తాజాగా అసలడతడు ఎలాంటి కామెంట్ పెట్టాడో చూపిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు రకుల్. దీనితో ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించేవారు కిక్కురుమనడంలేదు.