శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (16:48 IST)

అల్లు అర్జున్ అంటే ఇష్టం. - మంజిమా మోహన్

Manjima Mohan
మంజిమా మోహన్ బాల‌న‌టి నుంచి క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో న‌టించిన న‌టి. తెలుగులో `సాహసం శ్వాసగా సాగిపో` చిత్రంలో ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత తాజాగా త‌మిళంలో రూపొందిన ఎఫ్‌.ఐ.ఆర్‌.లో ఆమె న‌టించింది. విష్ణు విశాల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకు మ‌ను ఆనంద్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ఈనెల 11న తెలుగు, త‌మిళంలో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా మంజిమా మోహన్ తో చిట్ చాట్‌.
 
ఎఫ్‌.ఐ.ఆర్‌. ఎలాంటి సినిమా?
థ్రిల్ల‌ర్‌, మిక్సింగ్ క‌మ‌ర్షియ‌ల్ అండ్ కామెడీ సినిమా. నాకు చాలా ప‌త్యేక‌మైన‌ది కూడా. సాహసం శ్వాసగా సాగిపో`త‌ర్వాత వ‌స్తున్న సినిమా ఇది.
ఈ సినిమాలో మిమ్మ‌ల్ని ఇంప్రెస్ చేసిన అంశం ఏమిటి?
ద‌ర్శ‌కుడు మ‌ను ఆనంద్, `సాహ‌సం.. సినిమాకు అసోసియేట్‌గా చేశారు. అప్ప‌టినుంచి తెలుసు. క‌థ‌పై పూర్తి ప‌ట్టున్న వ్య‌క్తి. ఈ సినిమాకు ఎందుకు క‌నెక్ట్ అయ్యానంటే, కేర‌ళ‌లో జ‌రిగిన వాస్త‌వ సంఘ‌ట‌న‌. యువ‌కుడు టెర్రిస్టు చేతిలో ఇరుక్కుపోవ‌డం అనే అంశం క‌నెక్ట్ అయింది. ఇది రెగ్యుల‌ర్ సినిమా కాదు.
ఇలాంటి క‌థ‌లు కాంట్ర‌వ‌ర్సీఅవుతాయ‌ని మీకు అనిపించ‌లేదా?
నాకు అలా అనిపించ‌లేదు. క‌థే కీల‌మ‌ని నేను నమ్ముతాను. నా పాత్ర ఎలా వుంది. న‌టిగా నేను ఏం చేయ‌గ‌ల‌నేది చూస్తాను. నేను ఆడియ‌న్ గా ఎలా వుంటే బాగుంటుందో ఆ కోణంలో చూసి ఎంపిక చేసుకున్నా.ఇక కాంట్ర‌వ‌ర్సీ అనేది వుండ‌ద‌ని అనుకుంటున్నా. ఇందులో ఏ మ‌తానికి, కులానికి టార్గెట్ చేయ‌లేదు. 
విష్ణు విశాల్‌లో వ‌ర్కింగ్ ఎలా అనిపించింది?
నేను త‌న‌తో చేసిన మొద‌టి సినిమా. త‌ను గుడ్ ఏక్ట‌ర్‌. న‌ట‌నేకాదు ఇత‌ర రంగాల‌పై అవ‌గాహ‌న వుంది. కాంబినేష‌న్‌లో ఎవ‌రు ఎలా చేస్తున్నారో గ్ర‌హిస్తారు. సీన్స్ గురించి ఆలోచిస్తారు. పైగా నిర్మాత‌కూడా.
సినిమా ఎంపిక‌లో కొత్త ద‌ర్శ‌కుడు అని ఫీల్ క‌ల‌గ‌లేదా?
నేను క‌థ‌ను న‌మ్మాను. త‌ర్వాత క‌థ‌నం కు ఇంపార్టెంట్ ఇచ్చా. శ్యామ్ సింగ‌రాయ్ సినిమా తీసుకుంటే, అది రిస్కీ మూవీ. కానీ క‌థ‌ను చెప్పే విధానంలో ద‌ర్శ‌కుడు ప్ర‌తిభ క‌న‌బ‌డింది. ఇక మ‌ను ఆనంద్ నా ఫ్యామిలీ  ఫ్రెండ్‌. నా గురించి త‌న‌కు బాగా తెలుసు. పాత్ర ఎలా డిజైన్ చేస్తేబాగుంటుంద‌ని అ లా డిజైన్ చేశాడు.
సినిమా చూశాక మీకెలా అనిపించింది?
బాగా తీశార‌నిపించింది. నాతోపాటు ఇత‌ర న‌టీనటులు కొత్త‌వారైనా బాగా పెర్ ఫార్మ్ చేశారు. బెరుకులేకుండా న‌టించ‌డం గ్రేట్‌.
ర‌వితేజ స‌మ‌ర్ప‌కులుగా ఎలా ప్ర‌వేశించారు?
విష్ణుకు ఫ్రెండ్‌. ర‌వితేజ గారు రాబ‌ట్టే సినిమాపై అంచ‌నా పెరిగింది. విష్ణు కూడా తెలుగులో లాంచ్ అయింది. లేదంటే త‌మిళంలో చేయాల‌నుకున్నారు. రెండున్న‌రేళ్ళ క‌ష్టం. అందుకే తెలుగులో కూడా చేయాల‌ని ర‌వితేజ‌ను అప్రోచ్ కావ‌డం ఆయ‌న ఓకే అన‌డం జ‌రిగాయి. అయితే ఇంత‌కుముందు పెద్ద సంస్థలు ఓటీటీ ఆఫ‌ర్ కూడా ఇచ్చారు. కానీ వెండితెర‌పై చూడాల‌నే విడుద‌ల‌చేస్తున్నారు.
ఇలాంటి క‌థ‌లు సీరియ‌స్ మూడ్‌లో వుంటాయి. కానీ హీరోయిన్ల‌కు ప్రాధాన్య‌త వుండ‌దుగ‌దా?
ఇందులో న‌లుగురు ఫీమేల్ కేరెక్ట‌ర్‌లు చేశారు. కానీ ఎవ్వ‌రూ హీరోయిన్లు కాదు. నేను లాయ‌ర్‌గా న‌టించా. ప్ర‌తి పాత్ర డిఫ‌రెంట్ నేప‌థ్యం నుంచి వస్తారు. హాలీవుడ్ సినిమాలు చూసుకుంటే ఎక్క‌డా హీరో, హీరోయిన్ అనే కొల‌త‌లు వుండ‌దు. ఇద్ద‌రికీ స‌మాన స్థాయి వుంటుంది. ఈ సినిమా కూడా అంతే ప్రాధాన్య‌త వుంటుంది. 
సాహ‌సం.. చేశాక ఎందుకు తెలుగులో రాలేక‌పోయారు?
ఆ సినిమా త‌ర్వాత చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ త‌మిళంలో రావ‌డంతో అక్క‌డే చేయాల్సి వ‌చ్చింది. తెలుగులో వ‌స్తే చేసేదాన్ని
సౌత్‌లో హీరోయిన్లంటే క‌మ‌ర్షియ‌ల్ కోణంలో చూస్తారు. దాన్ని మీరెలా ఆలోచిస్తారు?
క‌మ‌ర్షియ‌ల్ అంటే డాన్స్, రొమాన్స్ చేయాలి. నేను అలాంటి వేవ్‌లో లేను. న‌టిగా నేను పెర్ ఫార్మెన్స్‌కే  ప్రాధాన్య‌త ఇస్తా. నాకు పాత్ర సంతృప్తిక‌రంగా వుందంటే అదే చేస్తా.
తెలుగులో ఏ హీరో, ఏ ద‌ర్శ‌కుడు అంటే ఇష్టం?
అల్లు అర్జున్ అంటే ఇష్టం. అల వైకుంఠ‌పురంలో, పుష్ఫ సినిమాల‌లో ఆయ‌న పెర్ ఫార్మెన్స్ చాలా బాగుంది. త‌ను డాన్స్ బాగా చేస్తాడు. గుడ్ లుకింగ్ యాక్ట‌ర్‌. ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చ‌ర‌ణ్‌, నాని కూడా గొప్ప న‌టులు. ద‌ర్శ‌కులుగా చెప్పాలంటే రాజ‌మౌళి, సుకుమార్, త్రివిక్ర‌మ్ సినిమాలంటే ఇష్టం.
కొత్త సినిమాలు?
త‌మిళంలోనే ఓ హార్ర‌ర్ మూవీ చేస్తున్నా.