శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (13:38 IST)

నేను గే కాదు -ముందుపుట్టివుంటే మేఘ‌ను పెండ్లిచేసుకునేవాడినిః వ‌ర్మ‌

Megha-varma
రామ్‌గోపాల్ వ‌ర్మలో హింసాత్మ‌క‌త ప్ర‌వృత్తితోపాటు సైకో కూడా వున్నాడ‌ని అత‌ని స‌న్నిహితులే చెబుతుంటారు. దానికి ఆయ‌న ఏమాత్రం వెనుకాడ‌డు. బ‌య‌ట ఏదో మాట అన‌డం దాన్ని ప‌బ్లిసిటీగా వాడుకోవ‌డం అత‌నికి వెన్న‌తోపెట్టి విద్య‌. త‌న‌కు శ్రీ‌దేవి అంటే ఎంతో ప్రేమ అనీ, ఆమెను ఆరాధిస్తూ వుంటాన‌ని చాలాసార్లు చెప్పాడు. కానీ ఆయ‌న మాట‌లు కాలాన్ని బ‌ట్టి మారుతుంటాయి. లేటెస్ట్‌గా న‌టి మేఘ‌పై క‌న్నుప‌డింది. ఆమె ఈయ‌న సినిమాల్లో న‌టించ‌లేదు కాబ‌ట్టి స‌రిపోయింది.
 
తాజాగా మేఘ ఆకాశ్ న‌టించిన సినిమా డియ‌ర్ మేఘ‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా నిర్వాహ‌కులు ఎంద‌రో ప్ర‌ముఖులు వ‌స్తార‌ని ప్ర‌చారం చేశారు. దాంతో ఫంక్ష‌న్ క‌ళ‌క‌ళ‌లాడింది. కానీ ఎవ్వ‌రూ రాలేదు. కార‌ణం వ‌ర్మ వ‌స్తున్నాడ‌ని తెలుసుకుని రాలేద‌ని తెర‌వెనుక టాక్ వినిపిస్తోంది. 
 
ఇక వ‌ర్మ ఫంక్ష‌న్‌కు రాగానే, చిత్ర‌యూనిట్‌లోకి యూత్ విజ‌ల్స్ వేయ‌డం జ‌రిగింది. ఇక వేదిక ఎక్కిన వ‌ర్మ మేఘ ఆకాశ్‌ను తెగ పొగిడేశాడు. నేను ముందు పుట్టివుంటే ఆమెను పెండ్లి చేసుకునేవాడ‌ని. అదెలాగంటే ర‌క్త‌చ‌రిత్ర‌లోలా ఎవ‌రైనా అడ్డువ‌స్తే అంద‌రినీ చంపేసి తీసుకెళ్ళేవాడిని. మేఘ వుంటే నేను ప్ర‌స్తుతం నా భార్య‌కు విడాకులు ఇచ్చేప‌రిస్థితి వ‌చ్చేదికాదు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత హీరో అదిత్ అరుణ్ గురించి మాట్లాడుతూ, త‌నంటే చాలా ఇష్టం. అదెలా గంటే నేను మేఘ‌ను పొగిడిన‌ట్లు పొగిడితే, న‌న్ను గే అనుకుంటారు. నాపై చాలా విమ‌ర్శ‌లు వున్నాయి. కానీ గే అనేది రాలేదు. అంటూసెటైర్ వేశాడు.