సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 21 మార్చి 2019 (16:03 IST)

కైరా అద్వానీని చూసి ఈర్ష్య పడిపోతున్నారట...

హిట్లు తక్కువైనా తెలుగు పరిశ్రమలో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది కైరా అద్వానీ. ఇప్పటికే భరత్ అను నేను, వినయ విధేయ రామ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న కైరా అద్వానీ యువ నటుడు అఖిల్‌తో నటించబోతోంది. అంతేకాదు మరో రెండు తెలుగు సినిమాల్లోను ఆమెకు అవకాశాలు ఉన్నాయి. తమిళంలో కూడా కైరా అద్వానీకి ఒక సినిమాలో అవకాశం ఉందట. 
 
అఖిల్ తో సరిపోయే హీరోయిన్ల కోసం వెతుకుంటే స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్న కైరా అయితేనే సరిపోతుందని ఆమెను సినిమాలో తీసుకున్నారట. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అలాగే మిగిలిన సినిమాలకు సంబంధించి కూడా కైరా అద్వానీ సంతకాలు చేసేసిందట. 
 
తెలుగు సినీపరిశ్రమలో బిజీబిజీగా ముందుకు వెళుతున్న కైరా అద్వానీ ని చూసి సహచర హీరోయిన్లు తెగ బాధపడిపోతున్నారట. అవకాశాలంతా కైరాకే వస్తోందని ఈర్ష్య పడిపోతున్నారట.