''గరుడ వేగ'' దర్శకుడితో రామ్, కాజల్ అగర్వాల్..
గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్ హీరోగా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ను కాజల్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలిసి
గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్ హీరోగా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ను కాజల్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలిసింది. ''గణేష్'' సినిమాలో రామ్ కాజల్ జంటకు కెమిస్ట్రీ అదిరింది. ప్రస్తుతం ట్రెండ్‌కు తగినట్టుగా.. మరోసారి ఈ జంట వెండితెర మ్యాజిక్ చేస్తారని సమాచారం.
థ్రిల్లింగ్, అడ్వెంచరస్, లవ్ స్టోరీగా ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి అడ్రస్ గల్లంతైందనుకున్న యాంగ్రీ హీరో రాజశేఖర్‌ను ఒడ్డున పడేసిన ప్రవీణ్ సత్తారు.. ఇప్పుడు రామ్‌కు గరుడవేగకు మించిన హిట్ ఇస్తాడని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.