శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మే 2022 (22:24 IST)

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ను కలిసిన 'విక్రమ్' టీం

rajini - kamal
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో విశ్వనటుడు కమల్ హాసన్ తాజాగా కలిశారు. ఆయన నటించిన తాజా చిత్రం 'విక్రమ్' వచ్చే నెల మూడో తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకానుంది. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఫహద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చగా, నిర్మాత ఆర్.రవీంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించారు. 
 
ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే కమల్ హాసన్, విక్రమ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కలిసి రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. ఈ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో లోకేష్ కనకరాజ్ షేర్ చేశారు. ఇదిలావుంటే, ఈ కమల్ హాసన్ ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ, తన సొంత రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలన్న తపనతో ఉన్నట్టు చెప్పారు. 
 
ఇందుకోసమే తాను రాజకీయ పార్టీని స్థాపించానని చెప్పారు. ఇకపోతే, దేశంలో సరికొత్త వివాదాన్ని రేకెత్తించిన నార్త్, సౌత్ వివాదంపై ఆయన స్పందించారు. తాను భారతీయుడునని తనకు ఈ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరుగుతానని చెప్పారు. పైగా, తాజ్‌మహల్ తనకు సొంతమని, మదురై మీనాక్షి ఆలయం మీు సొంతమని తెలిపారు.