1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (08:42 IST)

ప్రభాస్ 'ఆదిపురుష్‌' సీతగా ఆ హీరోయిన్ ఫిక్స్...

ప్రభాస్ హీరోగా నటించనున్న చిత్రం "ఆదిపురుష్". పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ను దర్శకుడు సంజయ్ రౌత్ ఫిక్స్ చేశారు. నిజానికి ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్న దానిపై పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే, అనేక రకాలైన ఊహాగానాలు వచ్చాయి. 
 
ఈ క్రమంలోనే అనుష్క శెట్టి, కీర్తిసురేశ్‌ పేర్లు కూడా వినిపించాయి. కాగా, ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌కు జంటగా సీత పాత్రలో కృతిసనన్‌ నటిస్తున్నారని చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే, బాలీవుడ్‌ నటుడు సన్నీసింగ్‌ లక్ష్మణుడిగా నటించనున్నారు.
 
"ఆదిపురుష్‌" టీమ్‌లోకి కృతిసనన్‌, సన్నీసింగ్‌లకు స్వాగతం పలుకుతూ శుక్రవారం ఉదయం చిత్రబృందం కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. అందులో ప్రభాస్‌, కృతిసనన్‌, సన్నీసింగ్‌ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు పాన్‌ ఇండియా మూవీగా రూపుదిద్దుకోనున్న ‘ఆదిపురుష్‌’లో బీటౌన్‌ స్టార్‌హీరో సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి పాత్ర పోషించనున్నారు.