తారకరత్నను చికిత్స కోసం విదేశాలకు తరలించే యోచనలో...
ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ హీరో తారకరత్నను విదేశాలకు తరలించాలన్న ఆలోచనలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను శుక్రవారం తెలుగుదేశం పార్టీకి చెందిన నేత అంబికా లక్ష్మీనారాయణ పరామర్శించారు.
ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'శుక్రవారం తారకరత్న మెదడు స్కానింగ్ తీశారు. వచ్చే నివేదిక ఆధారంగా మెదడు పనితీరు తెలుస్తుంది. పరిస్థితిని బట్టి విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు' అని లక్ష్మీనారాయణ తెలిపారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్య, పలువురు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు.