సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (17:36 IST)

న‌ల్ల‌మ‌ల పాట వింటుంటే హృద‌యం ద్ర‌విస్తుంది- కె.రాఘ‌వేంద్ర‌రావు

K. Raghavendra Rao
అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `నల్లమల`. నల్లమల అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ఆర్‌.ఎమ్ నిర్మాత‌. ఈ మూవీలోని సిద్ శ్రీ‌రామ్ పాడిన ఏమున్న‌వే పిల్లా సాంగ్ మిలియ‌న్స్ కి పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, అన్ని పాట‌ల‌కి విశేష స్పంద‌న ల‌భించింది. తాజాగా ఈ చిత్రంలోని  `మ‌న్నిస్తారా మూగ‌జీవులారా` పాట‌ను ద‌ర్శ‌కేంద్రుడు కే.రాఘ‌వేంద్ర‌రావు విడుద‌ల‌చేశారు. ఈ సంద‌ర్భంగా 
 
ద‌ర్శ‌కేంద్రుడు మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు ర‌విచ‌ర‌ణ్ మ‌న్నిస్తారా పాట‌ను చాలా బాగా చిత్రీక‌రించాడు. అప్పుడ‌ప్పుడు న‌ల్ల‌మ‌ల సినిమా ప్రోమోస్ చూస్తుంటాను. కొత్త బ్యాక్‌డ్రాప్‌లో చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు ఎవ‌రా అని వాక‌బు చేస్తే ఈ బ్యాన‌ర్ గురించి తెలిసింది. మ‌న్నిస్తారా మూగ‌జీవులారా పాట ప్ర‌తి లైన్ విని అర్ధం చేసుకుంటే హృద‌యం ద్ర‌విస్తుంది. జంతువుల ప‌ట్ల ఎంత అమానుషంగా ఉంటున్నామో తెలుస్తుంది. ఇలాంటి స‌బ్జెక్ట్ సెల‌క్ట్ చేసుకున్న న‌ల్ల‌మ‌ల టీమ్ ను మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్నాను`` అన్నారు.
 
నటీన‌టులు: అమిత్ తివారి, భానుశ్రీ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, ఛలాకీ చంటి, శుభోద‌యం రాజ‌శేఖ‌ర్‌, చ‌త్ర‌ప‌తి  శేఖ‌ర్‌, ముక్కు అవినాష్‌, శేఖ‌ర్ అలీ, అరోహి నాయుడు, అసిరి శ్రీ‌ను 
 
సాంకేతికంగానూ హై స్టాండర్డ్స్ లో నిలిచే ఈ మూవీకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్, నిర్మాత: ఆర్.ఎమ్, 
సినిమాటోగ్రఫీ: వేణు మురళి
సంగీతం, పాటలు: పి.ఆర్
ఎడిటర్: శివ సర్వాణి
ఆర్ట్:  పీవీ రాజు
ఫైట్స్: నబా
స్టైలిస్ట్‌: శోభ ర‌విచ‌ర‌ణ్‌
విఎఫ్ఎక్స్: విజయ్ రాజ్