మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జూన్ 2020 (12:12 IST)

మాధవీలత పెళ్లి కూతురు కానుందా? నెట్టింట్లో పోస్టు వైరల్

నటి మాధవీలత త్వరలోనే పెళ్లి కూతురు కానుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా మాధనీ లత పెట్టిన ఓ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ''కొన్ని నెలల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. జీవితంలో అద్భుతాలు జరుగుతాయని నేను ఎప్పుడూ నమ్ముతుంటాను. అలాగే నా జీవితంలో కూడా అద్భుతాలు జరిగాయి. వాటివల్ల నేను చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. త్వరలోనే నా సంతోషానికి గల కారణం ప్రకటిస్తాను'' అంటూ పోస్టు పెట్టింది. ఈ పోస్టు కాస్త వైరల్ అవుతోంది.  
 
మాధవీలత సినిమాల నుంచి విరామం తీసుకున్న రాజకీయాల్లో అడుగెట్టిన సంగతి తెలిసిందే. అయితే సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ఆమె తరచూ అందుబాటులో ఉంటారు. తన రోజువారీ లైఫ్‌స్టైల్‌ గురించి నెటిజన్లతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ నెట్టింట్లో చర్చనీయాంశమైంది. మాధవీలత పెట్టిన పోస్ట్‌తో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు.
 
అయితే ఈ వార్తలపై మాధవీలత స్పందించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని, తన పెళ్లి ఇప్పట్లో ఉండదని తేల్చిచెప్పింది. కంగ్రాచ్యులేషన్స్ అంటూ తన స్నేహితులు పెడుతున్న కామెంట్స్‌ చూసి పడి పడి నవ్వుకుంటున్నానని వెల్లడించింది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు తప్ప ఇప్పట్లో పెళ్లి ఊసే లేదని, అన్నీ కుదిరితే 2021లో పెళ్లి చేసుకుంటానని ఆమె పేర్కొంది. అంతేకాదు మంచి అబ్బాయి ఉంటే వెతికి పెట్టండంటూ తమదైన శైలిలో స్పందించారు.