1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (12:51 IST)

1020 మంది చిన్నారుల గుండెకు ఆపరేషన్.. సుప్రీతా అనే చిన్నారికి ప్రిన్స్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు వేలాది మంది చిన్న పిల్లల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు ఆపరేషన్ చేయించారు. ఆంధ్రా ఆసుపత్రి వారి సహకారంతో మహేష్ బాబు చేస్తున్న ఈ ఛారిటీ కంటిన్యూస్‌గా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు మహేష్ 1020 మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్స్ చేయించాడు. తాజాగా మరో పసి గుండెను కాపాడాడు. 
 
టి సుప్రీతా అనే చిన్నారి తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతోంది. ఆమెకు అత్యంత ఖరీదైన వైద్య చికిత్స అవసరం. ఆ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాడు మహేష్. ఈ వార్తను నమ్రత తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దాంతో మరోసారి మహేష్ బాబు మరియు నమ్రతలపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.