గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (16:27 IST)

ఎఫ్‌3 కోసం నాజూకుగా త‌యారైన మెహ్రీన్ పిర్జాదా

Mehreen
Mehreen
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించే పాత్రలు వినోదానికి కేరాఫ్ అడ్రస్సులుగా అలరిస్తుంటాయి. అలా ప్రేక్షకులకు కావాల్సిన వినోదం పంచిన పాత్రల్లో బ్లాక్ బస్టర్ హిట్ 'ఎఫ్2' లో మెహ్రీన్ పిర్జాదా చేసిన హానీ పాత్ర కూడా ముందు వరుసలో వుంటుంది. హనీ మేనరిజం, అమాయకత్వం, అల్లరి ప్రేక్షకుల మనసుని దోచుకున్నాయి. ఇప్పుడు ఎఫ్3లో హనీ పాత్రకు భిన్నంగా, ఎఫ్2కి మించిన వినోదం పంచబోతున్నారు మెహ్రీన్. ఈ చిత్రంలో మెహ్రీన్ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. 
 
Mehreen
Mehreen
ఈ చిత్రంలో చాలా నాజూగ్గా త‌యారైంది. అందుకు కొంత వెయిట్ లాస్ అయింది. ద‌ర్శ‌కుడు ఎఫ్3 లో మెహ్రీన్ పాత్రని మెచ్యూర్ అండ్ డిఫరెంట్ లేయర్స్ వున్న పాత్రగా పూర్తి వినోదాత్మకంగా రూపొందించారు. ఈ పాత్ర తన కెరీర్ లోనే ది బెస్ట్ ఎంటర్‌ట్రైనర్‌ రోల్ కాబోతుందని మెహ్రీన్ నమ్మకంగా వున్నారు.
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న సూపర్ క్రేజీ ప్రాజెక్ట్ ఇది. వెంకటేష్‌కి జోడిగా తమన్నా భాటియా, వరుణ్ తేజ్‌కి జోడిగా మెహ్రీన్ నటిస్తుండగా సోనాల్ చౌహాన్ మరో హీరోయిన్‌గా అలరించబోతుంది.  
 
ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'F3' థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అలాగే సెకెండ్ సింగిల్ 'వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా' పాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ట్రెండింగ్ లో వుంది.
 
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయబోతున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ తో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రలలో అలరించనున్నారు.      
 
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత.  మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.      
 
తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌవాన్, పూజా హెగ్డే (స్పెషల్ అప్పీరియన్స్) తదితరులు