ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (20:25 IST)

‘షాదీ ముబారక్’కు నాది గ్యారంటీ అంటోన్న‌ దిల్‌రాజు

Veer sagar, drusha, etc
వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ‘షాదీ ముబారక్‌’‌ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లు. మార్చి 5న విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ట్రైల‌ర్‌ను హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు విడుద‌ల చేశారు.
 
ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ- ‘‘2020లో కోవిడ్ రావడం ఏంటో కానీ 2021లో సినిమాలు విడుద‌ల‌వుతున్న తీరు చూస్తుంటే, 90లో ప్ర‌తి వారం రెండు, మూడు సినిమాలు  విడుద‌ల‌య్యేరోజులు గుర్తుకు వ‌స్తున్నాయి. ఇప్పుడు సినిమాల ఫ్లో స్టార్ట్ అయ్యింది. చిన్న‌, పెద్ద సినిమాలు  ఫ్లో అవుతున్నాయి. ఈ ఏడాది మా బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న సినిమాలు కానీ, ఇత‌ర నిర్మాత‌ల‌తో క‌లిసి స‌హ నిర్మాణంలో చేస్తున్న సినిమాలు ఫ్లో ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక ‘షాదీ ముబార‌క్’ సినిమా విష‌యానికి వ‌స్తే యూనిట్ సినిమాను పూర్తి చేసుకున్న త‌ర్వాత ఓరోజు సాగ‌ర్ నాకు సినిమా ట్రైల‌ర్‌ను చూపించాడు. చాలా ఆస‌క్తిక‌రంగా అనిపించ‌డంతో సినిమా చూస్తాన‌ని అన్నాను. సినిమా చూశాను. అక్క‌డ‌క్క‌డ కొన్ని పోర్ష‌న్స్ త‌ప్పితే సినిమా అంతా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైనర్‌గా అనిపించింది. సినిమాను చాలా బాగా తెర‌కెక్కించారు. నాకు సినిమాపై ఉన్న ఆలోచ‌న‌ను ఎలా చేయాలో శ్రీనివాస్ రెడ్డిగారికి, సాగ‌ర్‌కి చెప్పాను. వాళ్లు బాల్‌ని నా కోర్టులో వేశారు. నేను నాకు అనిపించిన క‌రెక్ష‌న్స్ గురించి చెప్పాను. వాళ్లు దాన్ని క‌రెక్ష‌న్స్ చేశారు. త‌ర్వాత సినిమాను రిలీజ్ చేయ‌మ‌ని మ‌రోసారి బాల్‌ను నా కోర్టులోనే వేశారు. మంచి సినిమాను మా బ్యాన‌ర్ నుంచి రిలీజ్ చేద్దామ‌ని నిర్ణ‌యించుకుని సినిమాను టేక్ ఓవ‌ర్ చేసుకున్నాం. సినిమా మ్యూజికల్‌గా కానీ, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కానీ అన్నీ బావున్నాయి. ద‌ర్శ‌కుడు ప‌ద్మ‌శ్రీ ఓ కొత్త పాయింట్‌తో సినిమాను తెర‌కెక్కించాడు. టీజ‌ర్, ట్రైల‌ర్ చూస్తే సినిమా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింద‌ని అర్థ‌మై ఉంటుంది. రెండు గంట‌ల ప‌దిహేను నిమిషాల వ్య‌వ‌థిలున్న ఈ సినిమా అంతా న‌వ్విస్తూనే ఉంటుంది. నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ. సినిమాను త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు అది నా గ్యారంటీ. థియేట‌ర్‌కు వ‌చ్చి ప్రేక్ష‌కులు సినిమాను స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నాను` అన్నారు.
 
హీరో వీర్ సాగ‌ర్ మాట్లాడుతూ - నేను ఎనిమిదేళ్లుగా స‌క్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప‌వ‌ర్‌స్టార్‌గారి సినిమా ఎప్పుడేసినా జ‌నాలు చూస్తారు. కానీ మాలాంటి వాళ్ల సినిమాల‌కు చిన్న టైమ్ స్టార్ట్ మాత్ర‌మే దొరుకుతుంది. అప్పుడు సినిమాను రిలీజ్ చేస్తే స‌క్సెస్‌తో పాటు నిర్మాత‌ల‌కు లాభాలు కూడా వ‌స్తాయి. రాజుగారు మంచి ఉద్దేశంతో ఎంక‌రేజ్ చేయ‌డానికి తీసుకున్న నిర్ణ‌య‌మిది. నన్ను కూడా ఎంక‌రేజ్ చేస్తార‌ని భావిస్తున్నాను. మెగాభిమానిగా స్టార్ట్ అయిన నేను బుల్లితెర‌పై మెగాస్టార్‌గా ఇమేజ్‌ను సొంతం చేసుకుని మ‌ళ్లీ బిగ్ స్క్రీన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాను’’ అన్నారు.