మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 18 జూన్ 2019 (14:00 IST)

దిల్ రాజుకి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన నాగ చైత‌న్య‌... ఏంటా షాక్..?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైత‌న్య మ‌జిలీ సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో కెరీర్‌లో జెట్ స్పీడుతో దూసుకెళుతున్నాడు. ప్ర‌స్తుతం మేన‌మామ వెంక‌టేష్‌తో క‌లిసి వెంకీ మామ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దస‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత నాన్న నాగార్జున‌తో బంగార్రాజు సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. 
 
జులైలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇదిలావుంటే... నాగ చైత‌న్య‌తో దిల్ రాజు ఓ సినిమా చేయాల‌నుకున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శితో ఈ సినిమా ఉంటుంద‌ని ఇటీవ‌ల ఎనౌన్స్ చేసారు. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అయితే.. చైత‌న్య ఇంత‌లో శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. 
 
ఆగ‌ష్టు నుంచి సెట్స్ పైకి వెళ్లేందుకు చైత‌న్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈ సినిమా త‌ర్వాత దిల్ రాజు సినిమా గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాడ‌ట‌. 
 
చైత‌న్య ఇచ్చిన షాక్‌కి దిల్ రాజు ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. కొత్త ద‌ర్శ‌కుడు శ‌శిని చైత‌న్య డేట్స్ ఇచ్చేవ‌ర‌కు వెయిట్ చేయ‌మ‌ని చెప్పాలో.. లేక వేరే హీరోతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలో ఏ నిర్ణ‌యం తీసుకోలేకపోతున్నాడ‌ట‌. అదీ.. మ్యాట‌రు..!