గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (19:01 IST)

ఫిట్‌నెస్ వ‌ల్లే యాక్ష‌న్ క‌ష్టం అనిపించ‌లేదుః నాగార్జున‌

Nag still
``మామూుగానే నాకు ఫిట్‌నెస్‌ అంటే ఇష్టం. నా ఏజ్ ఎంతో తెలుసా! ముప్ఫై ఒకటే. అందుకే యాక్షన్‌ సీక్వెన్స్‌లో పెద్ద కష్టం అనిపించలేదు. మనాలిలో యాక్షన్‌ సీక్వెన్స్‌ చేయడం కొంచెం కష్టం అనిపించింది. డేవిడ్‌ అనే హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ దగ్గర మా టీమ్‌ అంతా ట్రైన్‌ అయ్యాం` అని నాగార్జున వైల్డ్‌డాగ్ ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా మాట్లాడారు.
అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వైల్డ్‌డాగ్’. నాగార్జున జోడీగా బాలీవుడ్ తార దియా మీర్జా న‌టిస్తోన్న ఈ మూవీలో మ‌రో బాలీవుడ్ న‌టి స‌యామీ ఖేర్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మాత‌లు. ఈ ఏప్రిల్ 2న‌ ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సంద‌ర్భంగా నాగార్జున ఇంట‌ర్వ్యూ.
 
ఈ సినిమా మూల క‌థ ఏంటి?
` పూణెలోని జర్మనీ బేకరీలో మొదలై దేశంలో దాదాపు 17 చోట్ల బ్లాస్టింగ్స్‌ జరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన ట్విన్స్‌ బ్లాస్ట్స్‌ కూడా అందులో ఒకటి. ఆ వరుస బ్లాస్టింగ్స్‌ ఛేదించడం కోసం గవర్నమెంట్‌ ఆరుగురు ఎన్‌ఐఎ ఆఫీసర్స్‌ని నియమిస్తుంది. వాళ్ళు ఎలా దాన్ని ట్రేస్‌ చేశారు..అనేది మెయిన్ పాయింట్‌..అయితే ఆ ‌ఇన్‌వెస్టిగేషన్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వాళ్ళను పట్టుకొని ఇండియా కోర్టులో ప్రవేశ పెట్టి ఇండియా ఎంత కేపబుల్‌ అనేది మిగితా ప్రపంచానికి చూపించాలి అనేది వాళ్ళ మిషన్‌. దాన్ని ఎలా రీచ్ అయ్యారో థియేట‌ర్స్‌లో చూడాలి.
 
ట్రైల‌ర్ రిలీజ్ చేశాక సినిమాపై అంచ‌నాలు మ‌రింత బాగా పెరిగాయి క‌దా ఎలా అన్పిస్తోంది?
– వైల్డ్‌డాగ్ సినిమా టైటిల్ పాపుల‌ర్ అవ‌డానికి ట్రైల‌ర్ చాలా హెల్ప్ చేసింది. సినిమాకి ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకున్నామో.. ట్రైల‌ర్‌కి కూడా అంతే జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. ఆడియ‌న్స్ థియేట‌ర్స్ కి ర‌ప్పించ‌డానికి ట్రైల‌ర్ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. మేం ఈ సినిమా ద్వారా ఏం చెప్ప‌బోతున్నాం అని ట్రైల‌ర్‌లో చూపించాం. మంచి రెస్పాన్స్ వ‌స్తున్నందుకు చాలా హ్యాపీ..
 
ఈ సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్సెస్ రియ‌లెస్టిక్‌గా ప్లాన్ చేశారంట‌?
ఇది రియల్‌ ఇన్సిడెంట్స్‌తో కూడుకున్న సినిమా. రియల్‌ సినిమాలో కమర్షియల్‌ యాక్షన్‌ పెట్టలేము. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ రియల్‌గానే చూపించాలి. వీట‌న్నంటినీ బేలెన్స్‌ చేస్తూ ఒక కొత్త రకమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని ఈ సినిమాలో పెట్టడం జరిగింది. రేపు థియేటర్‌లో సినిమా చూసినప్పుడు తప్పకుండా ఆడియన్స్‌కి ఎగ్జైటింగ్‌గా అన్పిస్తుంది.
 
‘వైల్డ్‌డాగ్‌’ ప్రమోషన్స్‌ ఇంత వైడ్‌గా చేయడానికి రీజన్‌ ఏంటి?
` జనరల్‌గానే నాకు సినిమా ప్రమోషన్స్‌ అంటే ఇష్టం. నా ప్రతి సినిమాని బాగా ప్రమోట్‌ చేస్తాను. అయితే ఈ సినిమాకి ఇంకొంచెం ఎక్స్‌ట్రాగా ప్రమోట్‌ చేయడం ఈ సినిమాకి అవసరం. ఇది ఒక న్యూ ఏజ్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌. అందరం కొత్తగా ఎటెంప్ట్‌ చేశాం. ముఖ్యంగా ఈ సినిమాలో అందరికీ తెలిసిన ఫేస్‌ నేనొక్కడినే. మిగితా వాళ్లు అంతా కొత్తవారు. అందుకే నేనే రెస్సాన్సిబిలిటీగా ఎక్స్‌ట్రా కేర్‌, ఎక్స్‌ట్రా టైమ్‌ తీసుకొని వైడ్‌గా ప్రమోషన్స్‌ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తార్‌ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. గోవాలో ఒక షెడ్యూల్‌ చేశాం. వైల్డ్‌డాగ్‌ ప్రమోషన్స్‌ కోసమే కొంత విరామం తీసుకున్నాను.
40మంది ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేశారు. ఎలా ఫీల్‌ అవుతారు?
డెఫినెట్‌గా ఆ ఎగ్జ‌యిట్మెంట్ ఉంటుంది. కొత్త డైరెక్టర్‌ చేస్తే సినిమాకి కొత్తదనం వస్తుంది… నా రోల్స్‌ కూడా కొత్తగా ఉంటాయి. నా యాక్టింగ్‌ కూడా మారుతుందనే హోప్‌ నాకెప్పుడూ ఉంది. చేసిన పాత్రలే చేస్తూ ఉంటే బోర్‌ ఫీవుతాం. ఆ కారణం చేతనే కొత్త డైరెక్టర్స్‌తో వర్క్‌ చేయడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తాను. నేను ఈరోజు ఇంత పెద్ద స్టార్‌ అయ్యానంటే కేవ‌లం కొత్త డైరెక్టర్స్‌, కొత్తదనం వ‌ల్లే..
 
వైల్డ్‌డాగ్ స్క్రిప్ట్‌ ఎప్పుడు ఫైనల్‌ చేశారు?
` యాక్చ్యువల్‌గా ఈ కథ 2019 జూలై, ఆగస్ట్‌ మధ్యలో విన్నాను. అప్పుడే ‘బంగార్రాజు’ సినిమా కోసం రెడీ అవుతున్నాం. ఆ టైమ్‌లోనే ఈ స్క్రిప్ట్‌ కూడా వచ్చింది. రెండూ స్క్రిప్ట్స్‌ వర్క్‌ జరుగుతోంది. అయితే ‘బంగార్రాజు’ పండుగ సినిమా. సంక్రాంతికి వస్తేనే బాగుంటుంది. ఈ స్క్రిప్ట్ అయితే తొందరగా అయిపోతుందని 2019 డిసెంబర్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేసి మార్చి వరకు చేశాం. ఆ తర్వాత లాక్‌డౌన్‌ వచ్చింది. అప్పటికి యాభై శాతం షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. ఎప్పుడైతే షూటింగ్స్‌ చేసుకొవచ్చు అని పర్మిషన్‌ వచ్చిందో మిగితా సినిమా పూర్తి చేశాం.
 
ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో మీ కెరీర్‌లో ఇది వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ రోల్‌ అన్నారు క‌దా…?
– ` డెఫినెట్‌గా నా కెరీర్‌లో గొప్పగా చెప్పుకునే పాత్ర అవుతుంది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అందుకే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కూడా చెప్పాను. వెరీ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌. ఏ మగాడైనా ఇలా ఉండాలి అని వాళ్లు అనుకునేలాంటి పాత్ర.
 
సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎంతవరకు రీచ్‌ అవుతుంది?
– ` నేను ‘శివ’ సినిమా తీస్తున్నప్పుడు కూడా ఇందులో వయిలెన్స్‌ ఎక్కువగా ఉంది. ఫ్యామిలీస్‌కి కనెక్ట్‌ కాదేమో అనుకున్నారు. ఆ సినిమాతో పోల్చ‌డం కాదు కానీ.. ఆడవాళ్ళు కోరుకునేది కూడా ఇటువంటి క్యారెక్టర్‌ ఉన్న మగవాళ్ళని. అందుకే ఈ సినిమా ఫ్యామిలీస్‌కి కూడా రీచ్‌ అవుతుందనే నమ్మకం ఉంది.
 
ఈ సినిమాలో మీ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
– ` ఇందులో నేను ఎసిపి విజయ్‌ వర్మగా కనిపిస్తాను. ఎన్‌ఐఎ టీమ్‌ లీడర్‌. ఒక మంచి భర్త, మంచి ఫాదర్‌, మరియు మంచి టీమ్‌ లీడర్‌గా కనిపిస్తాను. దేశం కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాం. అతని ల‌క్ష్యం ఏమిటంటే దేశంలో శాంతి భద్రతకు విఘాతం కల్పించే టెర్రరిస్ట్‌ను పట్టుకోవడం. అయితే వారిని అరెస్ట్‌ చేయకుండా పూర్తిగా నిర్మూలిస్తాడు. త‌న సహచరుల‌ కోసం ప్రాణాలిచ్చే క్యారెక్టర్‌. ఒక‌ ఎన్‌ఐఎ ఆఫీసర్‌ అంటే ఇలాగే ఉండాలి అనుకునేలాంటి పాత్ర అందుకే నాకు అంత బాగా నచ్చింది.
 
ఈ క్యారెక్టర్‌ కోసం ఎలాంటి రిఫరెన్స్‌ తీసుకున్నారు?
– ` నేను ఎన్‌ఐఎ ఆఫీసర్స్‌ని కల‌వ‌లేదు. కానీ మా డైరెక్టర్‌ సాల్మాన్‌ కలిశారు. ఈ కథ చెబుతున్నప్పుడే సాల్మాన్‌కి చెప్పాను. కథ చాలా బాగుంది. కానీ రియల్‌గా తీస్తేనే వర్కవుట్‌ అవుతుంది. అందుకే మూడు నెల‌లుల‌ దానిమీదే పూర్తిగా రీసెర్చ్‌ చేశారు. ఇటీవల‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌లో పార్టిసిపేట్‌ చేసిన ఆర్మీ మేజర్‌ని కలిశాడు. తను ఆన్‌ లొకేషన్‌లో ఉండి, యాక్షన్‌ సీక్వెన్స్‌లో చాలా హెల్ప్‌ చేశారు. పుషప్స్‌, హ్యాండ్‌ సిగ్నల్స్‌, గన్‌ ఎలా పట్టుకోవాలి, గ్రానైట్స్‌ ఎలా హ్యాండిల్‌ చేయాలి.. ఇలాంటివన్నీ నేర్పించారు.
 
మీ ఫ్యాన్స్‌కి ఏం చెప్తారు?
` అభిమానులు నా నుండి కమర్షియల్‌ ఫిల్మ్‌ కోరుకుంటున్నారు కదా! ఇది ఒక కొత్త కమర్షియల్‌ ఫిల్మ్‌. డెఫినెట్‌గా ఈ సినిమా, నా క్యారెక్టర్‌ మీ అందరికీ నచ్చుతుంది. . మీరు అభిమానించే నాగార్జున ఈ సినిమా చేశాడు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రౌడ్‌గా ఫీల‌వుతారు.