శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 జులై 2022 (15:05 IST)

నాగార్జున న‌టిస్తున్న ది ఘోస్ట్ కిల్లింగ్ మెషిన్ ఫస్ట్ విజువల్

The Ghost, Nagarjuna
The Ghost, Nagarjuna
అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ది ఘోస్ట్' థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా సినిమా మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ యాక్షన్ బ్లాక్ త్వరలో షూట్ చేసి ప్రొడక్షన్ పార్ట్ని పూర్తి చేస్తారు.
 
జులై 9న విడుదల కానున్న ఫస్ట్ విజువల్తో ప్రేక్షకులని థ్రిల్ చేయడనికి సిద్ధమైంది ఘోస్ట్. ఈ సందర్భంగా విడుదల చేసిన 'కిల్లింగ్ మెషీన్' అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే ఫస్ట్ విజువల్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉండబోతోందని అర్ధమౌతుంది.
 
పోస్టర్లో నాగార్జున రెండు చేతులతో కత్తి పట్టుకుని టెర్రిఫిక్ గా వున్నారు. ఫార్మల్ సూట్  లో ఫిరోషియస్ గా కనిపిస్తున్నారు నాగార్జున. బ్యాగ్రౌండ్లో చంద్రుడు ఎరుపెక్కి వుండటం ఆసక్తికరంగా వుంది.
 
ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగార్జున తొలిసారిగా ఇంటర్పోల్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు. 'ది ఘోస్ట్' తో ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో వున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.
 
నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో గుల్ పనాగ్,  అనిఖా సురేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రానికి యువ సంగీత దర్శకులు భరత్ - సౌరభ్ పనిచేస్తున్నారు.
బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
 
తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు
సాంకేతిక విభాగం
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
సంగీతం : భరత్ - సౌరభ్
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  మోహన్
పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు