నాగార్జున కొత్త సినిమాలో కనిపించేది గంటేనా..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున మన్మథుడు 2 సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈసారి ఎలాగైనే సరే హిట్ మూవీ చేయాలనే ఉద్దేశ్యంతో విభిన్న కథా చిత్రాన్ని ఎంచుకున్నాడు. నాగ్ చేయబోయే సినిమాకి రచయిత సోలమన్ దర్శకత్వం వహించనున్నారు. ఊపిరి, మహర్షి చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన సోలమన్ చెప్పిన కథ నచ్చడంతో దర్శకత్వం వహించే అవకాశం ఆయనకే ఇచ్చారట నాగ్.
ఇది కాన్సెప్ట్ బేస్డ్ డ్రామా. ఇందులో నాగార్జున పోలీసాఫీసర్‌గా నటించనున్నారు. పోలీస్‌గా నటించడం నాగార్జునకు కొత్తేమీ కాదు. ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే... ఇందులో నాగార్జున గంట సేపు మాత్రమే కనిపిస్తారట. భారీ తారాగణంతో రూపొందే ఈ సినిమా ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుందని నాగార్జున చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట.
ఈ చిత్రం 2020 జనవరిలో రెగ్యులర్ షూట్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా కాకుండా రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నప్పటికీ నాగార్జున మాత్రం ఇంకా అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.