గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (14:29 IST)

సుమంత్ అశ్విన్‌‍తో నిహారిక ''హ్యాపీ వెడ్డింగ్''

''ఒక మనసు'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన మెగా హీరోయిన్ నిహారిక. సినిమాల్లో మెగా హీరోయిన్ కనిపించకూడదంటూ ఎన్ని అవరోధాలొచ్చినా.. హీరోయిన్‌గా రాణిస్తానని తెరంగేట్రం చేసిన నిహారికకు ఒక మనసు చేయూత నివ

''ఒక మనసు'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన మెగా హీరోయిన్ నిహారిక. సినిమాల్లో మెగా హీరోయిన్ కనిపించకూడదంటూ ఎన్ని అవరోధాలొచ్చినా.. హీరోయిన్‌గా రాణిస్తానని తెరంగేట్రం చేసిన నిహారికకు ఒక మనసు చేయూత నివ్వలేదు. వెబ్ సిరీస్, యాంకరింగ్‌ల ద్వారా మంచి పేరు కొట్టేసిన నిహారిక.. వెండితెరపై కూడా మంచి మార్కులేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకే తొలి సినిమాకు తర్వాత రెండో సినిమాకు చాలా టైమ్ తీసుకుంది. 
 
తాజాగా నాగబాబు కుమార్తె నిహారిక హ్యాపీ వెడ్డింగ్ అంటూ ముందుకొస్తోంది. తమిళంలో ఓ సినిమా చేస్తున్న నిహారిక.. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ చిత్రంలో హీరోగా సుమంత్ అశ్విన్ నటిస్తుండగా, హీరోయిన్‌గా నిహారికను ఎంపిక చేశారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. హ్యాపీ వెడ్డింగ్ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేయనున్నారు. రాకింగ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.