సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (18:26 IST)

#PoojaMustApologizeSamantha ఇదేం గోల..? (video)

#PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఈ వ్యవహారం ఏంటంటే? ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినీ నటులందరూ ఇంట్లోనే వుంటున్నారు. దీంతో రోజూ అప్ డేట్స్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. 
 
ఒక్కోసారి అదే వారికి పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది. సోషల్ మీడియా వేదికగా సమంతపై పూజా హెగ్డే చేసిన కామెంట్ ఆమె అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. వెంటనే పూజా హెగ్డే సమంతకు సారీ చెప్పాల్సిందే అంటూ పెద్ద రచ్చ చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళ్తే.. పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో సమంతపై చేసిన కామెంట్‌పై చర్చ సాగుతోంది. మజిలీ మూవీలోని సమంత స్క్రీన్ షాట్ చూపిస్తూ.. అందులో అంత అందంగా ఏం లేదని అలా ఉంటుందని కూడా తాను అనుకోవడం లేదని పూజా హెగ్డే ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన తర్వాత సమంత అభిమానులు రెచ్చిపోయారు. ఆ ఫోటో తీసి ఏకేస్తున్నారు. #PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్‌తో వ్యతిరేకంగా వేలల్లో ట్వీట్లు చేస్తున్నారు.  
 
పూజా వెంటనే అప్రమత్తయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందని చెప్పారు. ''నా టెక్నికల్‌ టీం సహకారంతో అకౌంట్‌ను మళ్లీ మా చేతుల్లోకి తీసుకున్నాం. హ్యాక్‌ అయిన సమయంలో నా అకౌంట్‌ నుంచి ఏదైనా పోస్ట్‌ అయ్యుంటే పెద్దగా పట్టించుకోకండి'' అంటూ చెప్పారు. అయినా కూడా సమంతకు పూజా హెగ్డే క్షమాపణలు చెప్పాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.