ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:40 IST)

యంగ్ రెబల్ స్టార్ జపాన్ అభిమానులకు "సాహో" కానుక

రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. అయితే ఆ సర్‌ప్రైజ్ ఇండియాలోని అభిమానులకు కాదు. జపాన్ అభిమానులకు కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమాకు సుజిత్‌ దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను జపాన్‌లో కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. 
 
ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’ సినిమా జపాన్‌‌లో ఘనవిజయం సాధించింది. జపాన్‌లో స్థానిక భాషలో విడుదలయ్యే సినిమాలకంటే ఎక్కువగా వారు ‘బాహుబలి’ని ఆదరించారు. అందుకు కృతజ్ఞతగా ప్రభాస్ జపాన్‌ కొత్త సంవత్సరం సందర్భంగా అభిమానులకుకానుకలు పంపించారు. 'సాహో' సినిమాను కూడా జపాన్‌లో విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది.
 
ఈ సినిమా జపాన్ వెర్షన్‌కు త్వరలో డబ్బింగ్‌ పనులు కూడా మొదలుకానున్నాయి. 'సాహో' ప్రచార కార్యక్రమాల కోసం ప్రభాస్ జపాన్‌కు కూడా వెళతారని తెలుస్తోంది. 'సాహో' సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, విక్రమ్‌ రెడ్డి, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ నటిస్తుండగా జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ, ఎవ్లిన్‌ శర్మ, అరుణ్‌ విజయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్‌, ఎహసాన్‌, లాయ్‌ త్రయం సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 15న ‘సాహో’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.