శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (18:30 IST)

నైన్త్ క్లాస్‌లోనే ప్రేమలో పడ్డ క్రేజీ హీరోయిన్..

కేవలం కంటిసైగలతో ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది ప్రియ ప్రకాశ్ వారియర్. ఆ తర్వాత ఆమె చేసిన ఒరు ఆదార్‌ లవ్ సినిమా ట్రైలర్‌తోనే ఆ చిత్రం ఏకంగా మూడు భాషలలో రిలీజ్ అయ్యింది. మలయాళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో కూడా అనువాదమైనప్పటికీ పూర్తిగా నిరాశ పరిచింది. అయినప్పటికీ ప్రియకు మాత్రం క్రేజ్‌ తగ్గలేదు. మోడలింగ్, అడ్వర్టైజ్‌మెంట్స్ అంటూ బిజీగా గడుపుతున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం శ్రీదేవి బంగ్లా అనే చిత్రంలో నటిస్తోంది.
 
ఇది అలనాటి హీరోయిన్ శ్రీదేవి బయోపిక్‌ అనే ప్రచారం జరగడంతో పెద్ద వివాదానికి తెరలేచింది. ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తున్న ఈ హీరోయిన్ ఇటీవల తన తొలి ప్రేమ గురించి బయటపెట్టింది. “నేను నైన్త్ క్లాస్‌లో ఉండగా సహ నటుడు నన్ను ప్రేమించాడు. అతను నాకు చేసిన ప్రపోజల్‌లో అతని సిన్సియారిటీ చూసి నేను కూడా అతన్ని ప్రేమించాను. 
 
అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, ఇంత చిన్న వయస్సులో ప్రేమ నాకే విడ్డూరంగా అనిపించింది. అందుకే మన మధ్య ఉన్నది అట్రాక్షన్ మాత్రమే, ఇందులో నిజమైన ప్రేమ ఉండదని అతనికి చెప్పాను. అతను కూడా కన్విన్స్ కావడంతో మేము ప్రేమకు దూరం అయినప్పటికీ స్నేహితులుగా కొనసాగుతున్నాము’ అని చెప్పింది.