మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 మే 2024 (14:13 IST)

ఫుష్ప ఫుష్ప.. సాంగ్ పై సింగర్ దీపక్ బ్లూ సెస్సేషనల్ కామెంట్

Pushpa 2 song  Singer Deepak Blue
Pushpa 2 song Singer Deepak Blue
సింగర్ దీపక్ బ్లూ.. ఇప్పుడు బాగా పాపులర్ అయిన గాయకుడిగా పేరు పొందాడు. ఇంతకుముందు నాన్న కు ప్రేమతో పాటు పాలు సినిమాలకు పాడినా రాని పేరు ఫుష్ప 2 లో పాడిన ఫుష్ప ఫుష్ప.. సాంగ్ కు ప్రచారం హోరెత్తింది. ఈ సాంగ్ ను దేశమంతా ఆదరించింది అని గాయకుడు దీపక్ బ్లూ తెలియజేస్తున్నారు. ఈ పాటను సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తనచే పాడించారని తెలిపారు.
 
ఈ సాంగ్ తో మీడియా ముందుకు వచ్చిన దీపక్.. మాట్లాడుతూ.. ఈ పాట లైన్లను.. ముందు వినిపించారు  ఎన్నో వచ్చిన పుష్ప కూ పాపం కొన్ని రావంటా.. అని ఒక మ్యాడ్యులేషన్ లో పాడితే ఇదేమిటి ఇలా వుంది. ఇలా రాశారు?. నెగెటివ్ గా వుందనుకున్నా.. రెండో లైన్ లో  వణుకే రాదు ఓటమిరాదు..  వెనకడుగు రాదు. అది విన్నాక.. పాజిటివ్ తోపాటు ఫెరేషియస్ గా వుందనిపించింది. నా మీనింగ్ అర్తం చేసుకున్న దేవీశ్రీ .. మాస్ సాంగ్స్ ఇలానే వుంటాయని క్లారిటీ ఇచ్చారు.
 
అదేవిధంగా గతంలో ఫుఫ్ప సినిమాలో ఏ బిడ్డ.. పాటకు బ్యాకింగ్ పాడాను. ఇద్దరు సింగర్స్ కలిసి పాడాం.. చాలా డఫరెంట్ గా వుందేమిటిని అనుకున్నాం. ఇప్పుడు సీక్వెల్ ను సోలో గా పాడడం చాలా ఆనందంగా వుంది. త్వరలో ఈ సాంగ్ నుతెరపై చూడాలనుకుంటున్నానని దీపక్ తెలిపారు.