శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (18:37 IST)

ఆర్ఆర్ఆర్‌ను టార్గెట్ చేస్తోన్న పుష్ప-2.. మార్చిలో రిలీజ్ అవుతుందా?

Pushpa: The Rise
అల్లు అర్జున్, సుకుమార్ జంటగా నటించిన "పుష్ప" చిత్రానికి సీక్వెల్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. "పుష్ప"కి సీక్వెల్‌గా వస్తున్న "పుష్ప ది రూల్" షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 
 
ఇప్పటివరకు చిత్రీకరణ 40శాతం మార్కును మాత్రమే చేరుకుంది. మొత్తం షూటింగ్ జనవరి 2024 కల్లా పూర్తవుతుందని సినీ యూనిట్ అంచనా వేస్తున్నారు. 
 
అయితే ఈ సినిమా మార్చి నాలుగో వారంలో విడుదలయ్యే ఛాన్సుందని టాక్ వస్తోంది. అంతేగాకుండా ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసేందుకు పుష్ప -2 సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఎన్టీఆర్- కొరటాల "దేవర" ఏప్రిల్ 5న విడుదల కానుండగా, "పుష్ప-2"ను మార్చిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు.
 
కాబట్టి జనవరిలోగా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయగలిగితేనే రిలీజ్ డేట్ ఖరారు అవుతుంది. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, అనసూయ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.