శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 29 ఏప్రియల్ 2021 (17:15 IST)

ఆర్‌.ఆర్‌.ఆర్‌. త‌ర‌ఫున సాయం చేస్తామంటున్న రాజ‌మౌళి

Rajamouli twiter
ఒక గంట స‌మ‌యం క‌ఠిన‌మైది. ప్రామాణిక‌మైన స‌మాచారాన్ని అందించాల్సిన ఈ గంటలో మా బృందం తన పనిని చేస్తోంది. అంటూ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ట్వీట్ చేశాడు. త‌మ ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్ కోవిడ్ 19కు చెందిన స‌మ‌స్య‌ల‌ను త‌మ‌కు తెలియ‌జేస్తే అందుకు త‌గిన నివార‌ణ‌ను తెలియ‌జేస్తామ‌ని అంటున్నాడు.
 
ఇప్ప‌టికే ప‌లు స్వ‌చ్చంధ సంస్థ‌లు త‌గిన విధంగా ఏదోర‌కంగా కోవిడ్ నివార‌ణ‌కు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటుంటే తాము కూడా అందులో ఓ భాగం అవుతున్నామ‌ని రాజ‌మౌళి త‌న ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్ ద్వారా తెలియ‌జేస్తున్నాడు.

కోవిడ్ స‌మ‌స్య‌ల‌పై కొంత సమాచారం పొందడానికి మరియు మీ చుట్టూ ఉన్నవారికి మేము సమన్వయం మరియు కొంత సహాయం అందించగలము. కరోనా బారిన పడిన వారు ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించవచ్చని, వారికి తగిన నివారణను చూపిస్తామని చెబుతోంది. తమ దగ్గరకు వచ్చే సమస్యలను దానిని పరిష్కరించే సంబంధిత వ్యక్తులకు, సంస్థలకు చేరవేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ట్విట్ట‌ర్ లో.ఆర్‌.ఆర్‌.మూవీని ఫాలో అవుతే సరికొత్త స‌మాచారం చూడ‌వ‌చ్చ‌ని తెలిపారు.