ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్.. ఓన్లీ వన్ పీస్.. రామ్ గోపాల్ వర్మ
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇంకా జనసేన అధినేత, జూనియర్ ఎన్టీఆర్‌లతో పలువురు హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని తాను సినిమాల పరంగా ఇష్టపడతానని.. రాజకీయ నాయకుడిగా కాదని చెప్పాడు. ఇక తన దృష్టిలో బెస్ట్ సీఎం అంటూ ఎవరూ లేరన్న ఆర్జీవీ.. ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్ అని వివరించారు.
వన్ వర్డ్‌లో పవన్ గురించి చెప్పాలంటే.. 'వెరీ టఫ్.. యూనిక్.. వన్ పీస్' అంటూ రామ్ గోపాల్ వర్మ పొగిడేశాడు. వరల్డ్‌లో పవన్ ఓన్లీ వన్ పీస్ అని ప్రశంసించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బెటర్ థాన్ సీనియర్ ఎన్టీఆర్ అంటూ వర్మ కామెంట్స్ చేశాడు. ఎప్పుడూ ఏదొక కాంట్రావర్సీతో హైలైట్ అయ్యే వర్మ టాలీవుడ్ హీరోల గురించి సానుకూలంగా స్పందించాడు.
కాగా రామ్ గోపాల్ వర్మ తాజాగా 'మర్డర్' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాలగూడ మర్డర్ మిస్టరీ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుండగా.. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు మూవీపై ఆసక్తిని పెంచేశాయి.