శుక్రవారం, 4 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 3 జులై 2025 (18:27 IST)

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

Ramayana, The Introduction Glimpses
Ramayana, The Introduction Glimpses
5000 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది భక్తికి ప్రతీక నమిత్ మల్హోత్రా 'రామాయణ' రెండు భాగాల లైవ్-ఆక్షన్ సినిమాటిక్ యూనివర్స్‌గా, ఇప్పటివరకు రూపొందిన అతి పెద్ద టెంట్‌పోల్ సినిమాల స్థాయిని రీఇమాజిన్ చేయనుంది. ఈ చిత్రం హాలీవుడ్, భారతదేశానికి చెందిన ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. 
 
నితేశ్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ అందుకున్న VFX స్టూడియో DNEG సంయుక్తంగా, యాష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్న రామాయణ, IMAX కోసం చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రం పార్ట్ 1 – దీపావళి 2026లో, పార్ట్ 2 – దీపావళి 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 
 
నేడు 'రామాయణ: ది ఇంట్రడక్షన్' పేరిట ఈ ఎపిక్ మూవీని గ్లోబల్‌గా ఆవిష్కరించారు. ఇది పురాణాలలోని రెండు అత్యంత ప్రసిద్ధ శక్తులైన రాముడు vs. రావణ మధ్య కాలాతీత యుద్ధానికి వేదికగా నిలిచింది. ఈ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఈ లాంచ్ భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాలలో ఫ్యాన్ స్క్రీనింగ్స్ ద్వారా, అలాగే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో భారీ బిల్బోర్డ్ టేకోవర్ ద్వారా వరల్డ్ వైడ్ గా జరిగింది.

విజనరీ దర్శక నిర్మాత నమిత్ మల్హోత్రా నేతృత్వంలో, యాష్ సహనిర్మాతగా రూపొందిస్తున్న ఈ రామాయణ… ఆస్కార్ అవార్డు పొందిన సాంకేతిక నిపుణులు, హాలీవుడ్ నిపుణులు, భారతీయ నటీనటులు, కథా కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ఇది మన నాగరికతలోని అత్యంత శక్తివంతమైన ఇతిహాసాన్ని ఆధునిక సాంకేతికతతో, భారతీయ సంస్కృతి మూలాలపై ఆధారపడిన ప్రపంచస్థాయి సినిమాటిక్ యూనివర్స్‌గా రీడిఫైన్ చేయనుంది.