మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (22:31 IST)

నా మాజీ బాయ్‌ఫ్రెండ్.. నాకూ ఇప్పుడూ ఫ్రెండే.. లైగర్ నచ్చాడు.. రష్మిక

Rashmika Mandanna
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న.. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై అందరినీ తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. 
 
ఇక.. పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈమె సినిమాల్లోకి వచ్చిన స్టార్టింగ్‌లోనే కన్నడ హీరో రక్షిత శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్న టైంలో అతడి నుంచి విడిపోయి బ్రేకప్ చెప్పింది.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి అడగగా.. "నా మాజీ బాయ్ ఫ్రెండ్‌ని నేను ఇప్పటికీ ఓ మంచి ఫ్రెండ్ లానే భావిస్తాను. అలాగే ప్రస్తుతం అతడి పార్ట్నర్, ఫ్యామిలీని కలిసేందుకు కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాజీ బాయ్ ఫ్రెండ్ తో ఫ్రెండ్షిప్ కొనసాగించడం మంచి పద్ధతి కాదు అని తెలుసు. కానీ నేను ఎవరికి శత్రువుగా ఉండను" అంటూ రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 
అలాగే విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె వాటిని ఖండించలేదు అలాగని ఒప్పుకోలేదు. ఆ వార్త వినడానికి చాలా క్యూట్‌గా ఉంది అంటూ సమాధానం ఇచ్చింది.
 
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీ ఆగస్టు 25న రిలీజ్ అయ్యి డిజాస్టర్‌గా మిగిలింది. దీనిపై రష్మిక స్పందించింది. ఈ చిత్రంపై రష్మిక చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. 
 
రష్మిక ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. లైగర్ సినిమా నాకు బాగా నచ్చింది. నాకు మాస్ మూవీస్ అంటే బాగా ఇష్టం. అందుకే లైగర్ నచ్చింది. ఈ మూవీ చూస్తున్నప్పుడు నేను విజిల్స్ వేశాను, డాన్స్ చేశాను. సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు. నాకు సినిమా నచ్చింది. విజయ్ అదరగొట్టేశాడు. ' అంటూ చెప్పుకొచ్చింది.