గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (16:43 IST)

ఎన్టీఆర్‌తో సినిమాకు సైన్ చేసిన రష్మిక మందన!

రష్మిక రేంజ్ ఏంటో.. అమాంతం పెరిగిపోతోంది. ప్రస్తుతం నాలుగు భాషల్లో కాల్షీట్లు బిజీ చేసుకుంటూ ఏ మాత్రం ఖాళీ లేకుండా.. సెట్స్‌లోనే టైం స్పెండ్ చేస్తోంది రష్మిక. ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఆల్రెడీ పుష్ప మూవీ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఆల్రెడీ బడా స్టార్ మహేశ్ బాబుతో చేసింది. అల్లు అర్జున్‌తో కూడా రెడీ. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ మూవీ. ఇంకేంటి చెప్పండి.. అందరు బడా స్టార్లనీ కవర్ చేస్తోంది రష్మిక.
 
ఈ మూవీలో కన్ఫమ్ అయినట్లే ఉంది అంటున్నారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో రాబోయే మూవీలో.. పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది కదా. సమంతా, కియరా అద్వానీ కూడా అనుకున్నారు. మెయిన్ గా అయితే.. అరవింద సమేత కాంబో రిపీట్ కాబోతుంది అనే టాక్ బాగా నడిచింది. 
 
పూజా హెగ్డే మీద త్రివిక్రమ్ కి స్పెషల్ ఇంట్రస్ట్ ఉందీ అనే విషయం ఇండస్ట్రీ మొత్తానికీ తెలిసిందే కదా. అందుకే.. పూజా హెగ్డేనే అనుకున్నారు. కానీ.. రష్మిక వెళ్లి త్రివిక్రమ్ ని కలవడంతో.. టాక్ టర్న్ అయింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో.. రష్మిక యాక్ట్ చేస్తోంది. హీరోయిన్‌గా ఫైనల్ అయింది అనే టాక్ వస్తోంది.