సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 1 జులై 2019 (14:08 IST)

మా ఇద్దరి జీవితాలు అందుకే నాశనమయ్యాయి : జోగి నాయుడు

మా ఇద్దరి జీవితాలు అందుకే నాశనయమ్యాయని నటుడు జోగినాయుడు అంటున్నారు. ఈయన బుల్లితెర యాంకర్ ఝాన్సీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ళ పాటు వీరి జీవితం సాఫీగానే సాగిపోయింది. ఆ తర్వాత ఏర్పడిన మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. 
 
నిజానికి వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా విడిపోయినట్టు ప్రచారం ఉంది. అసలు వారెందుకు విడిపోయారో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. తాజాగా ఝాన్సీతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను జోగి నాయుడు వెల్లడించారు. 
 
ఝాన్సీతో ప్రేమ వివాహానంతరం ఎనిమిదేళ్ళపాటు తమ జీవితం సాఫీగా సాగిపోయిందన్నారు. సరదాలు, విలాసాల విషయంలో ఇతరులతో పోల్చుకోవడం వల్లే జీవితాలు నాశమవుతాయని, అలాంటి అంశాల కారణంగానే తమ మధ్య కూడా గొడవలు మొదలయ్యాయని వెల్లడించాడు. 
 
ఝాన్సీ తన నుంచి విడిపోవడానికి ఆర్థిక పరమైన విషయాలే కారణమని, ఆమె కోసం తాను 8 ఏళ్లపాటు ఎదురు చూసి ఆ తర్వాతే మరో వివాహం చేసుకున్నానని జోగినాయుడు తెలిపాడు. అంతేకానీ, ఝాన్సీని తాను వేధించినట్టు వచ్చిన వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదని చెప్పారు.