సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (14:30 IST)

సందట్లో సడేమియా .. యోగా ప్రాక్టీసులో సుస్మితాకు ముద్దులు

కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. అత్యవసర పనులకు వెళ్లేందుకే పోలీసులు అనుమతిస్తున్నారు. అయితే, అనేక మంది సెలెబ్రిటీలు ఈ లాక్‌డౌన్ వేళ తమ ఫిట్నెస్‌ను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా, తమకు తోచిన విధంగా వివిధ రకాలై కార్యక్రమాలు చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. 
 
తాజాగా మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ కూడా యోగా శిక్షణలో నిమగ్నమైంది. తన బాయ్‌ఫ్రెండ్ రోహాన్ షాల్‌తో కలిసి ఆమె యోగా ప్రాక్టీస్ చేసింది. ఈ సందర్భంగా ఆమె గర్భాసనం వేసింది. ఆ సమయంలో సుస్మితా సేన్ నుదుటిపై రోహానన్ షాల్ ముద్దుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను సుస్మితా సేన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా, అది వైరల్ అయింది. 
 
కాగా, 43 యేళ్ళ సుస్మితా సేన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2000 సంవత్సరంలో రీనీను, 2010లో అలీషాను అనే ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుంది. ఇపుడు ఆమె రోహాన్ షాల్‌తో ప్రేమలోపడింది. వీరింతా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అంటే సుస్మితా సేన్ - రోహాన్ షాల్‌ సహజీవనం చేస్తున్నారు.