ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 20 అక్టోబరు 2018 (16:28 IST)

నేను నీకు ఛాన్స్ ఇస్తే నువ్వు నాకేం ఇస్తావని అడిగాడు?: పాయల్

దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం పెను సంచలనానికి దారితీసిన నేపథ్యంలో.. టాలీవుడ్‌లో హిట్ కొట్టిన ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి నోరు విప్పింది. ఆరెక్స్ 100లో అందాలను ఆరబోసి.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పాయల్ క్యాస్టింగ్ కౌచ్ మాట నిజమేనని అంగీకరించింది. నటిగా నిరూపించుకున్న తరువాత కూడా తనను ఆ భూతం వీడలేదని చెప్పింది. 
 
ఓ ఇంటర్వ్యూలో పాయల్ క్యాస్టింగ్ కౌచ్‌పై బాంబు పేల్చింది. తొలి సినిమాలో బోల్డ్‌గా నటించిన తనను అందరూ అదే విధంగా చూస్తున్నారని వాపోయింది. ఇటీవల ఓ సినిమాలో అవకాశం ఇస్తానని ఓ వ్యక్తి కలిశాడని.. ఆఫర్ ఇస్తే తనకు ఏమిస్తావని అడిగాడని.. ఆ ప్రశ్నతో ఖంగుతిన్నానని పాయల్ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో అతడి చెంపలు వాయించాలని అనిపించింది. 
 
కానీ కంట్రోల్ చేసుకున్నానని.. తన ప్రతిభకు టాలీవుడ్‌లో గుర్తింపు లభించిందేకానీ, ముద్దు సీన్లలో నటించినందుకు కాదని అతనికి గట్టిగా చెప్పినట్లు పాయల్ వెల్లడించింది. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తి ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించి వచ్చేశానని వ్యాఖ్యానించింది. అతని పేరును మాత్రం పాయల్ బయటపెట్టలేదు.