బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 మార్చి 2023 (10:19 IST)

దిల్ రాజు సెల్ఫిష్‌ అనడానికి శాకుంతలం ఉదాహరణ

Dil Raju
Dil Raju
ఏప్రిల్ 14న రిలీజ్ అవుతున్న శాకుంతలం సినిమాకు మొదట దిల్ రాజు లేడు. దాని గురించి  దిల్ రాజు వివరించారు.  ‘‘సినిమా చరిత్రలో మన తెలుగు సినిమా ఇంతింతై వ‌టుడింతై అనే స్టైల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా రేంజ్‌ను పెంచుకుంటూ వ‌చ్చేశాం. నేను కూడా నిర్మాత‌గా 50 సినిమాలు చేసేశాను. త‌మిళంలో ఈ ఏడాది వారిసు చేశాను. అలాగే ఇక్క‌డ కూడా బ‌ల‌గం సినిమాతో స‌క్సెస్ కొట్టాం. నెక్ట్స్ గేమ్ చేంజ‌ర్ కూడా రాబోతుంది. ఈ మ‌ధ్య‌లో శాకుంత‌లం సినిమా వ‌స్తుంది. నిజానికి గుణ శేఖ‌ర్‌గారు స‌మంత‌తో ఈ ప్రాజెక్ట్ అనుకున్న‌ప్పుడు నేను లేను. అయితే స‌మంత మేనేజర్ మ‌హేంద్ వ‌చ్చి ఇలా సినిమా అనుకుంటున్నారు సార్‌.. మీరు క‌థ వింటే బావుంటుందన్నారు. స‌రేన‌ని క‌థ విన్నాను.

అంద‌రూ నేను గుణ శేఖ‌ర్‌గారికి హెల్ప్ చేయ‌టానికి ఈ సినిమాలో జాయిన్ అయ్యాన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ నేను సెల్ఫిష్‌గా ఈ సినిమాలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్‌కు చేరుకుంది. అలాంటి గ్లోబ‌ల్ సినిమా గురించి నేర్చుకోవ‌టానికే నేను శాకుంత‌లంలో జాయిన్ అయ్యాను. వి.ఎఫ్‌.ఎక్స్ గురించి నేర్చుకోవాల‌నే ఉద్దేశంతోనే నేను ఇందులో పార్ట్ అయ్యాను. సాధార‌ణంగా ఇలాంటి సినిమాల్లో నిర్మాత‌ల‌కు పెద్ద‌గా ప‌ని ఉండ‌దు. కానీ నేను మాత్రం గుణ శేఖ‌ర్‌గారికి హెల్ప్ కావాలి. నేను కూడా నేర్చుకోవాల‌ని జాయిన్ అయ్యాను. బాహుబ‌లితో తెలుగు సినిమాను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్‌తో దాన్ని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లాడు. 
 
అలాగే తెలుగు సినిమాల‌ను ఇంకా ప్ర‌పంచానికి చూపిస్తూ ఉండాల‌నే ఉద్దేశంతో నేను వేసిన మొద‌టి అడుగు శాకుంత‌లం.బ్యూటీఫుల్ ఫ్యామిలీ డ్రామా.. విజువ‌ల్ వండ‌ర్‌గా సినిమా తెరెక్కింది. ఓ థియేట‌ర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా. ఏప్రిల్ 14న ఫ్యామిలీస్ అంతా క‌లిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మ‌న నెక్ట్స్ జ‌న‌రేష‌న్‌కు మ‌న క‌థ తెలియాలి. అందుక‌నే ఈ స‌మ్మ‌ర్‌లో ఏప్రిల్ 14న మా శాకుంత‌లం సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా చూసి బ‌య‌ట‌కొచ్చేట‌ప్పుడు అల్లు అర్హ రూపంలో ఓ స‌ర్‌ప్రైజ్ ఉంటుంది. నాకు సినిమా గురించి ఇంకా నేర్పించినందుకు గుణ శేఖ‌ర్‌గారికి థాంక్స్‌. ఈ మూవీ వ్య‌వ‌థి 2 గంట‌ల 19 నిమిషాలు. ఈ టైమ్‌లో ప్రేక్ష‌కుడికి ఎక్క‌డా బోర్ కొట్టించ‌కూడ‌దు. అదే పెద్ద చాలెంజ్‌. దాన్ని మనం ఎచీవ్ చేశాం’’ అన్నారు.