శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 21 నవంబరు 2018 (19:15 IST)

ఇలాంటి చిత్రంతో నా సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ కావడం ఆనందంగా వుంది... జయప్రద

ఆకాష్ కుమార్ హీరోగా మిస్టీ చక్రవర్తి హీరోయిన్‌గా యన్. నరసింహా రావు దర్శకత్వంలో ఏకేఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన చిత్రం శరభ. డాక్టర్ జయప్రద, నాజర్, నెపోలియన్, ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ప్రెస్ మీట్‌ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రంలో సీనియర్ నటి జయప్రద, హీరో ఆకాష్ కుమార్, దర్శకుడు యన్. నరసింహారావు, సహనిర్మాత సురేష్ కపాడియా పాల్గొన్నారు.
 
దర్శకుడు యన్. నరసింహారావు మాట్లాడుతూ... ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో దర్శకత్వశాఖలో పనిచేసాను. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. సోషియో ఫాంటసీ జోనర్లో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఎమోషన్‌తో పాటు సీజీ, గ్రాఫిక్స్ వున్నా సీన్స్ అన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయి. తొలి చిత్రమే గొప్ప ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. కథని నమ్మి మా నిర్మాత అశ్వనీ కుమార్‌గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు అని అన్నారు. 
 
హీరో అక్ష కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో లెజండరీ యాక్టర్స్‌తో పనిచేసినందుకు చాలా హ్యాపీగా వుంది. శరభ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా. దర్శకుడు నరసింహా రావు ఈ చిత్రాన్ని చాలా గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది అని అన్నారు. 
 
సీనియర్ హీరోయిన్ డాక్టర్ జయప్రద మాట్లాడుతూ... నా మొదటి చిత్రం రిలీజ్ అవుతుంటే ఎంత నెర్వస్‌గా ఫీలయ్యానో మళ్ళీ ఇప్పుడు ఈ శరభ సినిమా కూడా అంత నెర్వస్‌నెస్‌గా అనిపిస్తుంది. ప్రతి క్యారెక్టర్‌కి దర్శకుడు జీవం పోసాడు. సినిమాలో మంచి ఫీల్ ఉంటుంది. 
 
నా సెకండ్ ఇన్నింగ్స్‌లో శరభ లాంటి అద్భుతమైన సినిమాతో రావడం నాకు గర్వంగా వుంది. ఈ చిత్రంలో మదర్ క్యారెక్టర్లో నటించాను. రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాను. మ్యూజికల్‌గా కూడా ఈ చిత్రం చాలా బాగుంటుంది. టీమ్ అంతా చాలా కష్టపడి ఈ సినిమాకి పనిచేసారు. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.