శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (13:30 IST)

బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్: దీప్తి సునయన వచ్చేస్తోందట..

బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎపిసోడ్‌లో ఇప్పటికే కాజల్ అదేరీతిలో శ్రీరామ్ చంద్రకి చెందిన కుటుంబ సభ్యులు రావడం జరిగింది. టాప్ మోస్ట్ కంటెస్టెంట్‌‌లో మంచి క్రేజ్ ఉన్న షణ్ముక్ ఈ విషయంలో వాళ్ళ అమ్మగారు హౌస్‌లోకి ఈ ఫ్యామిలీ ఎపిసోడ్‌లో అడుగుపెట్టనున్నారని టాక్. 
 
కాగా షణ్ముఖ్ మాత్రం ఎప్పటి నుండో తన బెస్ట్ ఫ్రెండ్ దీప్తి సునయన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. గత వీకెండ్ ఎపిసోడ్‌లో కూడా నాగార్జునకి ఇదే విషయాన్ని తెలియజేయడం జరిగింది. 
 
ఇలాంటి తరుణంలో ఈ వీకెండ్‌లో దీప్తి సునయన నాగార్జునతో పాటు వేదికపై రానున్నట్లు సమాచారం. విషయంలోకి వెళితే గత సీజన్లలో ఆడిన ఒక మాజీ కంటెస్టెంట్‌నీ తీసుకొచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సమయంలో దీప్తి సునయన సెకండ్ సీజన్‌లో ఉండటంతో ఆమెను ఈ వారం బిగ్‌బాస్ వేదికపై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఈ రీతిగా హౌస్‌కి చివరి వారంలో కెప్టెన్ అయిన షణ్ముఖ్‌కి బిగ్ సర్ ప్రైజ్.. షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.