శనివారం, 9 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (11:39 IST)

వాల్తేరు వీరయ్యలో పవన్‌ కళ్యాణ్‌ నటించాల్సి వుందా!

Pawan Kalyan, raviteja
Pawan Kalyan, raviteja
ప్రస్తుతం సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మంచి సక్సెస్‌తో దూసుకుపోతుంది. మూడు రోజుల్లో 108 కోట్ల గ్రాస్‌ను ప్రపంచవ్యాప్తంగా దక్కించుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులకు, ఓవర్‌ సీస్‌ ప్రేక్షకులకు చిన్న పిల్లలకు, పెద్దలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. సినిమా సక్సెస్‌ సందర్భంగా చిరంజీవి, రవితేజ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
రవితేజ గురించి చిరంజీవి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. రవితేజ నాకు ఆజ్‌కా గూండారాజ్‌ నుంచి తెలుసు. తను చిన్న పాత్ర వేశాడు. తన చాలా షార్ప్‌. తన హెయిర్‌ స్టయిల్‌ హావభావాలు చూడగానే నాకు పవన్‌ కళ్యాణ్‌ గుర్తుకువచ్చేవాడు. అప్పటినుంచే నాకు సోదరుడుతో సమానం. నేను అతన్ని రవితేజ, సూర్య తేజ.. ఇలా రకరకాల పేర్లతో పిలిచేవాడిని. ఏం అన్నయా! ఇన్ని పేర్లు నాకు అనేవాడు. ఏదైనా సూర్యుడు వున్నాడుగదా అనేవాడిని. అన్నింటికంటే ముఖ్య కారణం.. తేజ అనేది ఆయన పేరులో వుంది. నా కుటుంబంలో అందరికీ తేజ వుంటుంది. అందుకే వాల్తేర్‌ వీరయ్య సినిమాలో దర్శకుడు రవీంద్ర సోదరిడి పాత్ర వుంది అనగానే.. వెంటనే నాకు స్పురించింది. తమ్ముడు రవితేజ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను రవితేజ లో చూసుకున్నాడు.