ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (16:48 IST)

సందీప్ కిష‌న్‌, దివ్యాంశ కౌశిక్ చిత్రం మైఖేల్ నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట విడుదల

Sandeep Kishan and Divyansha
Sandeep Kishan and Divyansha
సందీప్ కిషన్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' టీజర్‌ తో ఆడియన్స్ కు ఆడ్రినలిన్ రష్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు. ఇప్పుడు  మైఖేల్ నిర్మాతలు బ్లాక్ బస్టర్ నోట్‌లో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్‌ ని విడుదల చేశారు.
 
ఫస్ట్ సింగిల్ 'నువ్వుంటే చాలు' పాట మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచే అన్ని బలాలని కలిగి ఉంది. హాంటింగ్ థీమ్‌ను కలిగివున్న ఈ పాటని సామ్ సిఎస్ చాలా వండర్ ఫుల్ గా కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట విన్న వెంటనే మనసుల్ని తాకుతోంది. తన మెస్మరైజ్ వాయిస్ తో లిరిక్స్ ని అద్భుతమైన రీతిలో ఆలపించాడు. భావోద్వేగాలని హృద్యంగా పలికించాడు. కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని అందించిన సాహిత్యం మనసుల్ని ఆకట్టుకుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటిది.
 
దివ్యాంశ కౌశిక్ తన ఇంటి గేటు తెరచి సందీప్‌కి రొమాంటిక్ సిగ్నల్స్ ఇవ్వడంతో పాట ప్రారంభమవుతుంది. అతను తికమకలో ఉన్నప్పుడే ఆమె అతన్ని ఆహ్వానించడం, ఆ తర్వాత వీరిద్దరూ రొమాంటిక్ మూడ్‌లోకి రావడం చాలా అందంగా గా ప్రజంట్ చేశారు. సందీప్, దివ్యాంశల అద్భుతమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. లిప్ లాక్ కూడా ఉంది. కంపోజిషన్, వాయిస్ లానే విజువల్స్ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి.
 
రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు ల జాయింట్ ప్రొడక్షన్ వెంచర్. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.
 
స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కిరణ్ కౌశిక్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.
 
 తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్,అనసూయ భరద్వాజ్ తదితరులు