బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (09:21 IST)

పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అతి త్వరలో దర్శకత్వం వహించ‌న‌న్న‌ట్లు శ్రీను వైట్ల ప్ర‌క‌ట‌న‌

Srinu Vaytla
Srinu Vaytla
నేడు త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అతి త్వరలో దర్శకత్వం వహించ‌న‌న్న‌ట్లు శ్రీను వైట్ల ప్ర‌క‌టించారు. తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో వినోదాన్ని పండిస్తూ బ్లాక్ బస్టర్స్ అందించి దర్శకుడు శ్రీను వైట్ల ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. నీ కోసం తో దర్శకుడిగా పరిచయమయ్యి మొదటి చిత్రంతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డ్ అందుకుని సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు శ్రీను వైట్ల. అందరూ కొత్తవారితో నిర్మించిన ఆనందం తో భారీ విజయం సాధించి పరిశ్రమలో సంచలనం సృష్టించారు. వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వెంకటేశ, తో మెమొరబుల్ హిట్స్ సాధించిన శ్రీను వైట్ల దూకుడు తో తిరుగులేని హిట్ కొట్టారు. తర్వాత వచ్చిన బాద్ షా తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 
 
టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలు అందించిన ఘనత శ్రీను వైట్ల సొంతం.  నేడు (సెప్టెంబర్ 24) జన్మదినం జరుపుకుంటున్న శ్రీను వైట్ల అగ్ర హీరో తో కలిసి భారీ ప్రాజెక్ట్ తో మరో సారి తన మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ కి సంబందించిన ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. అద్భుతమైన కథ తో పాటు తన మార్క్ వినోదంతో వస్తున్న శ్రీను వైట్ల మరో భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే శ్రీను వైట్ల.