శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (13:28 IST)

క్యాన్సర్‌పై పోరాటం చేస్తా.. తండ్రిని అలా కోల్పోయా.. సన్నీ లియోన్ (video)

పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్.. ప్రస్తుతం సినిమాలతోనే కాకుండా ప్రకటనలతో బిజీ బిజీగా గడుపుతోంది. వయాకామ్18 సమర్పిస్తున్న మోతీచూర్ చక్నాచూర్ సినిమాలో హాట్ అందాలను ఆరబోస్తున్న సన్నీ లియోన్.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటలో నవాజుద్దీన్ సిద్దీఖీతో కలిసి స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన సాంగ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. 
 
అలాగే కామసూత్రపై ఏక్తాకపూర్ తీస్తున్న వెబ్ సిరీస్‌లో మెరవనుంది. ఇందులో సన్నీలియోన్ లీడ్ రోల్‌లో కనిపిస్తోంది. మరోవైపు సన్నీ లియోన్ కేన్సర్‌పై పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ష్యాషన్ డిజైనర్ మహేకా మిర్‌పూరి నిర్వహిస్తున్న ఛారిటీ కార్యక్రమంలో ఈ హాట్ బ్యూటీ పాల్గొనబోతోందని బిటౌన్ వర్గాల సమాచారం. 
 
దీనిపై సన్నీ మాట్లాడుతూ.. తన తండ్రి క్యాన్సర్ కారణంగా మరణించారు. క్యాన్సర్ నిర్మూలనకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పుకొచ్చింది. విరాళాల సేకరణకు తన వంతు కృషి చేస్తానని తెలిపింది. మనముందున్న మహమ్మారి వ్యాధితో చేస్తున్న యుద్ధంలో చిన్న గెలుపు సాధించినట్లేనని సన్నీ లియోన్ వెల్లడించింది.