సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (10:33 IST)

''కామసూత్ర'' వెబ్ సిరీస్‌తో వస్తోన్న సన్నీలియోన్.. ఇక సెన్సార్ అక్కర్లేదట..

పోర్న్ కమ్ బాలీవుడ్ హీరోయిన్ అయిన సన్నీలియోన్ తాజాగా కామసూత్రతో తెరపైకి వచ్చేస్తోంది. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీల్లో కూడా తనదైన శైలిలో మెప్పిస్తోన్న సన్నీలియోన్.. కామసూత్రతో అందాల ఆరబోతకు సిద్ధమవుతోంది. సినిమాలు అయితే సెన్సార్‌ చేయాల్సిన అవసరం ఉంటుంది.. అందుకే ఇప్పుడు అందరి చూపులు వెబ్ సిరీస్ వైపు పడుతున్నాయి. ఇప్పుడు సన్నీతో కూడా ఓ హాట్ వెబ్ సిరీస్ చేయబోతోంది. 
 
ఏకంగా కామసూత్రను మళ్లీ చేయబోతున్నారు. సన్నీలియోన్‌ ముఖ్యపాత్రలో వాత్సాయనుడి కామసూత్ర ఆధారంగా వెబ్ సిరీస్ నిర్మించబోతుంది. కామసూత్ర బుక్‌ బేస్‌ చేసుకుని ఇదివరకే కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా వెబ్ సిరీస్ ద్వారా సన్నీ హాట్ సన్నివేశాల పంట పండించనుందని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి సెన్సార్ లేని ఈ కామసూత్ర ఎన్ని సరికొత్త సెన్సేషన్స్‌కు తెర తీస్తుందో వేచి చూడాలి మరి.