సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (16:32 IST)

చెన్నై వరద బాధితుల కోసం సూర్య-కార్తీ రూ.10 లక్షల సాయం

Surya_Karthi
Surya_Karthi
సూర్య, కార్తీ మన టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోలు. ఇక ఈ ఇద్దరి సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండగా, వీరి తదుపరి చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆది, సోమవారాల్లో తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా నీటిమట్టం పెరగడంతో పలు ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. 
 
చెన్నై వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సోదరులు సూర్య, కార్తీ ఇద్దరూ ముందుకొచ్చారు. చెన్నై వరద బాధితుల కోసం సూర్య, కార్తీ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు నటీనటులు సూర్య, కార్తీ రూ. 10 లక్షలు ప్రకటించినట్లు పీఆర్వో మనోబాల విజయబాలన్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం సూర్య తన బ్లాక్‌బస్టర్ మూవీ కంగువతో బిజీగా ఉన్నాడు. ఇది శివ దర్శకత్వంలో, ఆది నారాయణ రాసిన పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. స్టూడియో బ్యానర్‌పై కె ఇ జ్ఞానవేల్ రాజా, వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తీ ఇటీవల జపాన్ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించాడు.