Video Viral, బస్సు నడిపిన మిల్కీ బ్యూటీ తమన్నా (video)
బాహుబలి చిత్రంతో యమ క్రేజ్ సంపాదించుకున్న తమన్నా భాటియా ఆ తర్వాత F2 చిత్రంతో మరో హిట్ కొట్టింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ మిల్కీ బ్యూటీ తాజాగా ఓ ఫీట్ చేసి అందర్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసింది.
ఇంతకీ ఏం చేసిందంటే.. గోపీచంద్ సరసన సిటీమార్ అనే చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ సెట్లో ఓ బస్సును నడిపింది. తను బస్సు నడుపుతున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.