గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (16:13 IST)

చిక్కుల్లో నయనతార దంపతులు - సర్రోగసీ వివరాలు కోరిన సర్కారు

nayanathara
అగ్ర హీరోయిన్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌లు చిక్కుల్లో పడ్డారు. సర్రోగసీ విధానం తర్వాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన ఈ దంపతులు ఇపుడు సమస్యలో చిక్కుకున్నారు. వివాహమైన ఐదేళ్ల తర్వాత ఈ దంపతులు అద్దె గర్భంద్వారా బిడ్డలను కనాల్సివుంది. కానీ, అందుకు విరుద్ధంగా వారు ఆదివారం ఇద్దరు కవల పిల్లలకు జన్మినిచ్చారు. ఇది వివాదం కావడంతో వారి నుంచి వివరణ కోరుతామని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రహ్మణ్యం చెప్పారు. 
 
సర్రోగసీపై వివరాలను నయనతార, విఘ్నేష్ దంపతులు ప్రభుత్వానికి అందజేయాలని, ఈ వివరాలను తమిళనాడు మెడికల్ డైరెక్టరేట్ ద్వారా కోరుతామని ఆయన చెప్పారు. నిబంధనల ప్రకారంమే సర్రోగసీ ప్రక్రియ జరిగిందా లేదా అన్నది నయన్ దంపతులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.