మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (11:48 IST)

న‌టిగా రీ ఎంట్రీకి సిద్ధం కానీ ఒక్క కండిష‌న్ అంటోన్న ఊహ‌

Srikanth, ooha, Rohan, Roshan, Medha
Srikanth, ooha, Rohan, Roshan, Medha
ప్ర‌ముఖ హీరో, కేరెక్ట‌ర్ న‌టుడు శ్రీ‌కాంత్ మేక న‌టి ఊహ‌ను పెద్ద‌ల‌ను ఒప్పించి ప్రేమ‌వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఊహ సినిమాల్లో న‌టించ‌డం మానేశారు. వారికి ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె వున్నారు.  రోహన్, రోషన్, మేధ వారి పేర్లు. పెద్ద కుమారుడు రోష‌న్ ఇప్పుడు హీరోగా న‌టిస్తున్నాడు. తాజాగా రెండో సినిమాను కె.రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేస్తున్నారు.
 
కాగా, ఊహ మ‌ర‌లా తాను న‌టించ‌డానికి సిద్ధ‌మైంది. ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డిస్తూ, పెండ్లి త‌ర్వాత పిల్ల‌ల బాధ్య‌త వ‌ల్ల నేను న‌టించ‌లేక‌పోయాను. నాకు వారి ఎదుగుద‌ల‌కంటే ఏదీ ముఖ్యంకాదు. ఈ విష‌యంలో భ‌ర్త శ్రీ‌కాంత్ కూడా ప్రోత్సాహం వుంది. ఇప్పుడు నేను న‌టించాల‌నుకుంటున్నాను. ముందుగా రోష‌న్‌కు త‌ల్లిగా, శ్రీ‌కాంత్‌కు భ‌ర్త‌గా ఏదైనా సినిమాలో ఛాన్స్ వ‌స్తే న‌టిస్తాన‌ని పేర్కొంది. రోష‌న్‌కు త‌ల్లిగా ఓకే శ్రీ‌కాంతే భ‌ర్త‌గా కావాల‌న‌డం ఒక సినిమాకేనా అన్ని సినిమాల‌కా అన్న దానికి న‌వ్వుతూ దాటవేసింది.