శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 10 డిశెంబరు 2019 (15:50 IST)

రేపు ఆత్మహత్య చేసుకుంటాం: నానిగాడు చిత్ర హీరో దుర్గాప్రసాద్..

రేపు ఫిల్మ్ ఛాంబర్ వద్ద నానిగాడు చిత్ర యూనిట్ ఆత్మహత్య చేసుకుంటాం అని హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు నాని గాడు సినిమా హీరో దుర్గా ప్రసాద్. 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నానిగాడు సినిమా తెస్తే సినిమా విడుదల కాకముందు యూట్యూబ్‌లో పెట్టారని చిత్ర యూనిట్ ఆందోళన చేశారు.
 
సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు యు సర్టిఫికెట్ ఇచ్చిందని, సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో యూట్యూబ్‌లో సినిమా మొత్తం పెట్టారని చిత్ర యూనిట్ ఆవేదన వ్యక్తం చేశారు.

యూట్యూబ్ లింక్‌ను వెంటనే తొలగించి న్యాయం చేయాలని, అందుకోసం  పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అన్నారు. మాకు న్యాయం జరగకపోతే రేపు చిత్ర యూనిట్‌తో ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆత్మహత్య చేసుకుంటాం అని హెచ్చరించారు.