సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (10:30 IST)

ఆపరేషన్ వాలెంటైన్ లోని వందేమాతరం గీతం వాఘా బోర్డర్ లో ఆవిష్కరణ

Vande Mataram song, Operation Valentine team
Vande Mataram song, Operation Valentine team
వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ అడ్వెంచర్ 'ఆపరేషన్ వాలెంటైన్' ఫస్ట్ సింగిల్ 'వందేమాతరం' అమృతసర్‌లోని ఐకానిక్ వాఘా సరిహద్దులో లాంచ్ చేసిన మొట్టమొదటి పాటగా చరిత్ర సృష్టించింది.  ఫస్ట్ స్ట్రైక్ వీడియో అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత, ఈ పాటను రిపబ్లిక్ డే వారంలో వరుణ్ తేజ్, మానుషి చిల్లార్‌తో సహా మొత్తం టీమ్ సమక్షంలో లాంచ్ చేశారు
 
 టైటిల్ సూచించినట్లుగా వందేమాతరం దేశ స్ఫూర్తిని చాటే దేశభక్తి గీతం. వైమానిక దళ సైన్యం పెద్ద యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు చూపే ఈ పాట తమ దేశ రక్షణకు పోరాడే ధైర్యవంతులందరికీ నివాళి.
 
ఈ పాట గొప్ప ఉత్తేజాన్ని కలిగిస్తూ, గర్వంగా నిలబడేలా స్ఫూర్తిని కలిగిస్తుంది. ఈ చిత్రంతో హిందీలో అరంగేట్రం చేస్తున్న వరుణ్ తేజ్ ఈ పాటలో యూనిఫాంలో ఫిట్‌గా, అద్భుతంగా కనిపించారు. తెలుగులో అరంగేట్రం చేస్తున్న మానుషి చిల్లర్ యుద్ధంలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ (వరుణ్ తేజ్) గురించి ఆందోళన చెందే రాడార్ ఆఫీసర్‌గా కనిపించింది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం శక్తివంతమైన పదాలతో గొప్ప ఉత్తేజం, ఉత్సాహం నింపింది.
 
మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ పాటను తెలుగు లో అనురాగ్ కులకర్ణి, హిందీలో సుఖ్వీందర్ సింగ్ చక్కగా పాడారు. అద్భుతమైన కంపోజిషన్,  దేశభక్తి పంక్తులు, మంత్రముగ్ధులను చేసే వోకల్స్, కట్టిపడేసి విజువల్స్ తో వందేమాతరం పాట బ్లాక్ బస్టర్ నంబర్ అవుతుంది.
 
ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్) సహా నిర్మాతలు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీలో ఫిబ్రవరి 16 న విడుదల కానుంది.